భ‌యంతో ఆడిన పంత్‌.. సంజీవ్ గోయెంకా రియాక్ష‌న్‌! | Pant Finds Special Mention Sanjiv Goenka Reacts Won Match Vs SRH | Sakshi
Sakshi News home page

IPL 2026: భ‌యంతో ఆడిన పంత్‌.. సంజీవ్ గోయెంకా రియాక్ష‌న్‌!

Apr 6 2026 8:50 AM | Updated on Apr 6 2026 9:14 AM

Pant Finds Special Mention Sanjiv Goenka Reacts Won Match Vs SRH

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ బోణీ కొట్టింది. ఆదివారం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో 5 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్ ఐదో బంతికి విజాయ‌న్ని అందుకుంది. కాగా రిష‌బ్ పంత్ (68 నాటౌట్‌) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడ‌గా.. ఓపెన‌ర్ మార్క‌ర‌మ్ (45) మ‌రోసారి మెరిశాడు. 

అయితే పంత్ త‌న శైలికి విరుద్ధంగా ఎక్కువ బంతులాడి అర్థ‌సెంచ‌రీ సాధించ‌డం ఆస‌క్తిగా క‌నిపించింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ ఓట‌మి పాల‌వ్వ‌డంతో ఆ జ‌ట్టు య‌జమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ పంత్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లు రావ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఇద్ద‌రు సీరియ‌స్‌గా చ‌ర్చించుకున్న వీడియోలు బ‌య‌టికి వ‌చ్చాయి.  

ఆ త‌ర్వాత ల‌క్నో ఫ్రాంచైజీ దీనిపై స్ప‌ష్ట‌త‌నిస్తూ పూర్తి వీడియోనూ విడుద‌ల చేయ‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది. కానీ ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్‌లో మాత్రం ఆ భ‌యం పోలేద‌నిపిస్తుంది. ఈసారి కూడా ఓట‌మి చ‌విచూస్తే త‌మ బాస్ ఆగ్ర‌హానికి గుర‌వ్వాల్సి వ‌స్తుంద‌ని పంత్ భావించిన‌ట్లున్నాడు. అందుకే ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో పంత్ ఆఖ‌రిదాకా నిల‌బ‌డి జ‌ట్టును గెలిపించాడు. 

ఫలించిన మొక్కులు..
మ్యాచ్ విజ‌యం అనంత‌రం పంత్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన సంజీవ్ గోయెంకా ఈసారి మాత్రం న‌వ్వుతూ అత‌న్ని హ‌గ్ చేసుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినందుకు అత‌న్ని మెచ్చుకున్నాడు. అయితే మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో లక్నో గెలవాలని సంజీవ్‌ గోయెంకా పదేపదే తన వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకు మొక్కడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఎస్ఆర్‌హెచ్‌పై విజ‌యం అనంత‌రం సంజీవ్ గోయెంకా త‌న జ‌ట్టును మెచ్చుకుంటూ ట్విట‌ర్‌లో పోస్టు పెట్టాడు. ‘ఐపీఎల్ అనేది సుదీర్ఘంగా సాగుతుంది. ఒక జట్టు విజయం సాధించాలంటే సమయం, సహనం, జట్టు ఐకమత్యం అవసరం. ఇవాళ ఆ మూడు మా లక్నో జట్టులో ప్రతిబింబించాయి. పంత్ కెప్టెన్‌గా జట్టును దిశానిర్దేశం చేస్తే ఆటగాళ్లంతా క్రమశిక్షణతో దానిని అనుసరించారు. 

జట్టులో ఉండే సమన్వయం ఎదుగుదలకు తోడ్పతుంది. ఈ విజయం మాకు ఆరంభం మాత్రమే. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మున్ముందు మా ఆటలో మరింత పురోగతి కనిపిస్తుందని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. 

మిడిలార్డర్‌లో నితీశ్‌కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌లు అర్థసెంచరీలతో రాణించడంతో ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం లక్నో 19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

చదవండి: ఆర్సీబీతో మ్యాచ్‌.. ఓట‌మికి పూర్తి బాధ్యత నాదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement