Asia Cup 2022: ఆసియా కప్‌కు జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. స్పీడ్ స్టార్ ఎంట్రీ!

ఆసియా కప్, నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్‌లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్లను బుధవారం ప్రకటించింది. నెదర్లాండ్స్ సిరీస్‌తో పాటు ఆసియాకప్‌లో కూడా పాక్ జట్టుకు రెగ్యూలర్ కెప్టెన్ బాబర్ ఆజాం సారథ్యం వహించనున్నాడు. నెదర్లాండ్స్, ఆసియా కప్‌లకు రెండు వేర్వేరు జట్లను పాక్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక ఆ జట్టు యువ పేసర్ నసీమ్ షా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నాడు.
ఈ రెండు జట్లలో అతడికి చోటు దక్కింది. ఇప్పటి వరకు కేవలం టెస్టుల్లో మాత్రమే పాక్‌కు ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్ల నసీమ్ షా.. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. తన అరంగేట్ర టెస్టులోనే ఆస్ట్రేలియా బ్యాటర్లకు నసీమ్ చుక్కలు చూపించాడు. ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా తన సత్తా చాటడానికి సిద్దమయ్యాడు.
కాగా నెదర్లాండ్ పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ తలపడనుంది. రోటర్డ్యామ్ వేదికగా ఆగస్టు 16న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక నెదర్లాండ్‌తో వన్డే సిరీస్ అనంతరం ఆసియా కప్‌లో పాకిస్తాన్ పాల్గొనుంది. ఆసియా కప్‌లో భాగంగా పాక్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28 టీమిండియాతో తలపనుంది. ఇక ఆసియా కప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది.
The wait is finally over as the battle for Asian supremacy commences on 27th August with the all-important final on 11th September.
The 15th edition of the Asia Cup will serve as ideal preparation ahead of the ICC T20 World Cup. pic.twitter.com/QfTskWX6RD
— Jay Shah (@JayShah) August 2, 2022
నెదర్లాండ్స్‌తో వన్డేలకు పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సల్మాన్ అలీ అఘా, షాహీన్ షా ఆఫ్రిది, షానవాజ్ దహానీ, జాహిద్ మెహమూద్
ఆసియా కప్‌కు పాక్ జట్టు
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షాహనావాజ్ ఆఫ్రిది దహానీ ,ఉస్మాన్ ఖదీర్
చదవండి: Asia Cup 2022 Schedule: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
🇵🇰✈️
🚨 Pakistan's squads for Netherlands ODIs and ACC T20 Asia Cup 🚨
Read more: https://t.co/CsUoxtXc1H#NEDvPAK | #AsiaCup2022 pic.twitter.com/4be4emR8Sy
— Pakistan Cricket (@TheRealPCB) August 3, 2022
మరిన్ని వార్తలు