భారీ న‌ష్టాల్లో న్యూజిలాండ్ క్రికెట్‌ బోర్డు! | NZ Cricket Reports $7.3 Million Financial Loss In 2025-26 Following Dream11 Sponsorship Loss, Check Out More Details | Sakshi
Sakshi News home page

భారీ న‌ష్టాల్లో న్యూజిలాండ్ క్రికెట్‌ బోర్డు!

Aug 21 2026 9:27 AM | Updated on Aug 21 2026 11:37 AM

NZ Cricket Financial-Loss 2025-26 After-Losing-Dream11 sponsorship

Photo Credit: Twitter

క్రికెట్‌లో బ్లాక్‌క్యాప్స్‌గా పిలుచుకునే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆర్థిక కష్టాల్లో పడింది. గ‌తేడాది ఆర్థిక సంవ‌త్స‌రంలో భారీ న‌ష్టాల‌ను చ‌విచూసిన‌ట్లు ప్ర‌క‌టించింది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో 7.3 మిలియ‌న్ డాల‌ర్లు (భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 69 కోట్లు) ప్రాథ‌మిక లోటు ఉన్న‌ట్లు తెలిపింది. 

జూలై 31, 2026తో ముగిసిన గ‌తేడాది ఆర్థిక సంవ‌త్స‌రం బ‌డ్జెట్లో అంచనా వేసిన రూ. 1.8 మిలియన్ల నష్టం కంటే ఇది చాలా ఎక్కువ. స్పాన్సర్‌షిప్‌లు తగ్గడం, అకౌంటింగ్ సర్దుబాట్లు , ఖర్చులు పెరగడం ఇందుకు ప్రధాన కార‌ణమ‌ని కివీస్ బోర్డు తెలిపింది. ముఖ్యంగా డ్రీమ్ 11 స్పాన్స‌ర్‌షిప్‌ను కోల్పోవ‌డం వల్ల ఆదాయం త‌గ్గిపోవ‌డంతో పాటు ఖ‌ర్చులు పెరిగిన‌ట్లు స్పష్టం చేసింది.

అయితే ఈ ఏడాది చివర్లో స్వదేశంలో టీమిండియా ప‌ర్య‌ట‌న వ‌ల్ల సుమారు 10 మిలియ‌న్ డాల‌ర్లు వ‌స్తాయ‌ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆశాభావం వ్య‌క్తం చేస్తోంది. సూప‌ర్ స్మాష్ పోటీ స్థానంలో 2027-28 సీజన్ కోసం ప్ర‌తిపాదిత టీ20 ఫ్రాంచైజీ లీగ్‌కు సంబంధించి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. 

ఈ వేస‌విలో జ‌రిగే సూప‌ర్ స్మాష్ పోటీల్లో మొత్తం 64 మ్యాచ్‌ల్లో ఫైన‌ల్ స‌హా 24 మ్యాచ్‌లను డ‌బుల్ హెడ‌ర్‌గా ప్ర‌సారం చేస్తామ‌ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కార్య‌నిర్వ‌హ‌ణాధికారి జియోఫ్ అల్ల‌ట్ స్ప‌ష్టం చేశాడు. ఇక డిసెంబ‌ర్‌-జ‌న‌వరి నెలలో జ‌రిగే సూప‌ర్ స్మాష్ పోటీల‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వ‌చ్చే నెల‌లో విడుద‌ల కానుంది. 

ఇక ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్, వెస్టిండీస్‌పై వ‌న్డే సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్‌ స్వ‌దేశంలో భార‌త్‌తో అక్టోబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ మ‌ధ్య సుదీర్ఘ సిరీస్ ఆడ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా ఐదు టీ20లు,ఐదు వ‌న్డేలు, రెండు టెస్టులు ఆడ‌నుంది.

Read: భారీగా యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మ‌నీ.. సింగిల్స్ విజేతకు 52 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement