BCCI: అది సరికాదు.. యువీకే తప్పలేదంటే... | Not Right: Yuvraj No Communication Claim Over Career Draws Blunt Reaction | Sakshi
Sakshi News home page

BCCI: అలా చేయడం సరికాదు.. యువీకే తప్పలేదంటే...

Apr 6 2026 5:37 PM | Updated on Apr 6 2026 5:50 PM

Not Right: Yuvraj No Communication Claim Over Career Draws Blunt Reaction

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు యువరాజ్‌ సింగ్‌. భారత జట్టు 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే వరల్డ్‌కప్‌ గెలవడంతో ఈ మాజీ ఆల్‌రౌండర్‌ది కీలక పాత్ర. ఈ మెగా టోర్నీ తర్వాత క్యాన్సర్‌ఉందని తేలగా.. మొక్కవోని విశ్వాసంతో మహమ్మారి జయించి తిరిగి మైదానంలో అడుగుపెట్టిన ఘనుడు యువీ.

అయితే, కెరీర్‌ చరమాంకంలో యువీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. జట్టులో చోటు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాలన్న కోరిక తీరకుండానే యువీ రిటైర్మెంట్‌ ప్రకటించాల్సి వచ్చింది.

కనీస సమాచారం కూడా ఇవ్వకుండా..
ఈ విషయం గురించి యువరాజ్‌ సింగ్‌ తాజాగా స్పోర్ట్స్‌ తక్‌ ఇంటర్వ్యూలో స్పందించాడు. నాటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి తన పేరును పరిగణనలోకి తీసుకోలేదని.. అందుకు సంబంధించి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయాడు. ఫిట్‌నెస్‌ పరీక్ష పాసైనా ఎదురుచూపులు తప్పలేదని.. అందుకే రిటైర్మెంట్‌ ఇచ్చానని తెలిపాడు.

అంతటి యువీకే తప్పలేదంటే
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ యువీ వ్యాఖ్యలపై స్పందించాడు. యువరాజ్‌ పట్ల యాజమాన్యం వైఖరి తనను నిరాశపరిచిందని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘మొదట్లో వార్తా పత్రికల్లో చూసి ఆటగాళ్లు తమ కెరీర్‌ కొనసాగుతుందా? ముగిసిపోయిందా? అని తెలుసుకునేవాళ్లు.

అయితే, యాజమాన్యం మరీ ఇంత ఘోరంగా ఉండాల్సింది కాదు. టీమిండియాకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన యువరాజ్‌ సింగ్‌ వంటి దిగ్గజాల విషయంలోనైనా కాస్త మెరుగ్గా ప్రవర్తించాల్సింది. తనను ఎవరూ సంప్రదించకుండానే రిటైర్మెంట్‌ తీసుకునేలా చేశారని యువీ అన్నాడు. ఇలా చేయడం సరికాదు. కచ్చితంగా ఆటగాళ్లతో చర్చించి వారికి మేనేజ్‌మెంట్‌ స్పష్టతనివ్వాలి’’ అని వసీం జాఫర్‌ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నాడు.  

రో-కోలకు చెప్పండి
కాగా యువీ ఇటీవల మాట్లాడుతూ.. మేనేజ్‌మెంట్‌ తన విషయంలో వ్యవహరించినట్లు మరెవరి విషయంలో వ్యవహరించకూడదని అన్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతూ.. వరల్డ్‌కప్‌-2026 రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకు కూడా మేనేజ్‌మెంట్‌ సరైన సమాచారం ఇవ్వాలని యువీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. వాళ్లిద్దరు గొప్ప ఆటగాళ్లని.. వారిని సాదరంగా పంపితే బాగుంటుందని పేర్కొన్నాడు.

చదవండి: CSKకు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement