ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పూరన్ తీవ్ర నిరాశపరిచాడు. అయూశ్ బదోని ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పూరన్ గుజరాత్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. 21 బంతులు ఎదుర్కొన్న పూరన్.. 2 సిక్స్‌ల సాయంతో 19 పరుగులు చేశాడు.
అయితే పూరన్ జిడ్డు ఇన్నింగ్స్ ఆడినప్పటికి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు. ఈ కరేబియన్ ఆటగాడు లక్నో తరపున ఇప్పటివరకు 47 మ్యాచ్‌ల్లో 1422 పరుగులు సాధించాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ లక్నో తరపున 38 మ్యాచ్‌ల్లో 1410 పరుగులు నమోదు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో రాహుల్‌ను పూరన్ అధిగమించాడు.
లక్నో తరపున టాప్-3 రన్ స్కోరర్లు వీరే
నికోలస్ పూరన్-1422
కేఎల్ రాహుల్-1410
ఆయుష్ బదోని-1038
చదవండి: IPL 2026: 'అతడే మన బెస్ట్ బౌలర్.. గెలిచే మ్యాచ్‌లను దగ్గరుండి ఓడిస్తాడు'


