ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ వైఫల్యం కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ, బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది. శనివారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది.
220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. రెగ్యులర్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ప్రస్తుత జట్టులో సీనియర్ పేసర్‌గా ఉన్న జయదేవ్ ఉనద్కట్ దారుణంగా విఫలమవుతున్నాడు. గల్లీ బౌలర్ల కంటే దారుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే జయదేవ్ పూర్తిగా తేలిపోయాడు.
సరైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌లో అతడు తీవ్రంగా శ్రమించాడు. పంజాబ్ బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. ఉనద్కట్ తన మూడు ఓవర్ల కోటాలో 13.30 ఏకానమీతో 40 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అతడు విఫలమయ్యాడు.
ఆ మ్యాచ్‌లో అయితే ఉనద్కట్ 3.5 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 50 పరుగులు ఇచ్చాడు. ఈ రెండు మ్యాచ్‌లలో కూడా అతడు ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. మొత్తంగా అతడు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు సాధించాడు. జయదేవ్ ఏకానమీ రేటు 10.90గా ఉంది.
దీంతో ఇంతదారుణంగా విఫలమవుతున్నప్పటికి అతడిని ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగించడం పట్ల ఎస్ఆర్‌హెచ్ అభిమానులు మండిపడుతున్నారు. ఉనద్కట్‌ను సైతం ట్రోల్ చేస్తున్నారు. "బ్యాటింగ్‌లో కోహ్లి రన్ మిషన్ అయితే, బౌలింగ్‌లో ఉనద్కట్ ఒక రన్ మిషన్" అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.
'జయదేవ్ ఉనద్కట్ మన బెస్ట్ బౌలర్.. గెలిచే మ్యాచ్‌లను దగ్గరుండి ఓడిస్తాడు' అని మరొక నెటిజన్ ఈ సెటైరికల్ పోస్ట్ చేశాడు. అతడి స్ధానంలో ప్రఫుల్ హింగే, ఓంకర్ తర్మాలే వంటి యువ పేసర్లకు అవకాశమివ్వాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. తదుపరి మ్యాచ్‌కైనా ఉనద్కట్‌పై ఎస్‌ఆర్‌హెచ్ వేటు వేస్తుందో లేదో చూడాలి.
చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! ఒకవేళ అదే జరిగితే?


