
ఆసియాప్-2025కు ముందు పాకిస్తాన్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ హారిస్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మహ్మద్ రిజ్వాన్ స్దానంలో చోటు దక్కించుకున్న హారిస్.. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆసియాకప్ సన్నాహాకాల్లో భాగంగా యూఏఈ, అఫ్గానిస్తాన్‌లతో పాక్ జట్టు ట్రైసిరీస్ ఆడుతోంది.
ఈ ముక్కోణపు సిరీస్‌లో హారిస్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అఫ్గాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసిన హారిస్.. యూఏఈతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. 2 బంతులు ఎదుర్కొని జునైద్ సిద్ధిక్ బౌలింగ్‌లో జవదుల్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
నిర్లక్ష్యపు షాట్ ఆడి డీప్ థర్డ్‌మ్యాన్‌లో అతడు దొరికిపోయాడు. దీంతో హరిస్ తన సహనాన్ని కోల్పోయాడు. తన కోపాన్ని బ్యాట్‌పై చూపించాడు. బ్యాట్ ను నేలకేసి బలంగా కొట్టాడు. దెబ్బకు బ్యాట్ హ్యాండిల్ దగ్గర విరిగిపోయింది. విరిగిన బ్యాట్‌ను తీసుకొని పెవిలియన్‌కు వెళ్లాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అంత ఓవరాక్షన్ అవసరమా అంటే కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో యూఏఈపై 31 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది.
హారిస్‌పై విమర్శలు..
ఇక ఇది ఇలా ఉండగా.. ట్రై-సిరీస్ ప్రారంభానికి ముందు బాబర్ ఆజం గురుంచి హారిస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాబర్ టీ20లకు సరిపోడని, అతడి స్ట్రైక్ రేటు చాలా తక్కువ ఉంటుందని హారిస్ పేర్కొన్నాడు. ఇప్పుడు అతడి ప్రదర్శనలపై పాక్ అభిమానులు మండిపడుతున్నారు. బాబర్‌ను విమర్శించే స్ధాయి తనది కాదని ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
చదవండి: IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టులో పాసైన కెప్టెన్
This was silly bud...really silly. pic.twitter.com/WK9zB3h3xK
— Aatif Nawaz (@AatifNawaz) August 30, 2025