చాంప్‌ వెర్‌స్టాపెన్‌ | Sakshi
Sakshi News home page

చాంప్‌ వెర్‌స్టాపెన్‌

Published Wed, Oct 26 2022 5:24 AM

Max Verstappen wins the 2022 United States GP - Sakshi

ఆస్టిన్‌: ఫార్ములావన్‌ సీజన్‌లో ఇదివరకే చాంపియన్‌షిప్‌ ఖాయం చేసుకున్న రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఖాతాలో మరో విజయం చేరింది. యూఎస్‌ గ్రాండ్‌ప్రిలోనూ ఈ బెల్జియం రేసర్‌ విజయం సాధించాడు. సర్క్యూట్‌ ఆఫ్‌ అమెరికాస్‌లో సోమవారం రాత్రి ముగిసిన 56 ల్యాపుల రేసును వెర్‌స్టాపెన్‌ అందరికంటే ముందుగా ముగించాడు. గంటా 42 నిమిషాల 11.687 సెకన్లలో ముగించి 2022 సీజన్‌లో 13వ టైటిల్‌ సాధించాడు.

మాజీ చాంపియన్, మెర్సిడెజ్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ 5.023 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలువగా, ఫెరారి డ్రైవర్‌ లెక్‌లెర్క్‌ 7.501 సెకన్ల తేడాతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో ప్రస్తుతం 13 విజయాలతో 391 పాయింట్లతో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోగా... చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (267), సెర్గెయ్‌ పెరెజ్‌ (రెడ్‌బుల్‌; 265) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్‌లో తదుపరి రేసు మెక్సికన్‌ గ్రాండ్‌ ప్రి 29, 30 తేదీల్లో జరుగుతుంది. సీజన్‌లో తర్వాతి రేసు మెక్సికన్‌ గ్రాండ్‌ప్రిగా ఉంటుంది.   

ఆస్టిన్‌: ఫార్ములావన్‌ సీజన్‌లో ఇదివరకే చాంపియన్‌షిప్‌ ఖాయం చేసుకున్న రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఖాతాలో మరో విజయం చేరింది. యూఎస్‌ గ్రాండ్‌ప్రిలోనూ ఈ బెల్జియం రేసర్‌ విజయం సాధించాడు. సర్క్యూట్‌ ఆఫ్‌ అమెరికాస్‌లో సోమవారం రాత్రి ముగిసిన 56 ల్యాపుల రేసును వెర్‌స్టాపెన్‌ అందరికంటే ముందుగా ముగించాడు. గంటా 42 నిమిషాల 11.687 సెకన్లలో ముగించి 2022 సీజన్‌లో 13వ టైటిల్‌ సాధించాడు. మాజీ చాంపియన్, మెర్సిడెజ్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ 5.023 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలువగా, ఫెరారి డ్రైవర్‌ లెక్‌లెర్క్‌ 7.501 సెకన్ల తేడాతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో ప్రస్తుతం 13 విజయాలతో 391 పాయింట్లతో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోగా... చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (267), సెర్గెయ్‌ పెరెజ్‌ (రెడ్‌బుల్‌; 265) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్‌లో తదుపరి రేసు మెక్సికన్‌ గ్రాండ్‌ ప్రి 29, 30 తేదీల్లో జరుగుతుంది. సీజన్‌లో తర్వాతి రేసు మెక్సికన్‌ గ్రాండ్‌ప్రిగా ఉంటుంది.  

Advertisement
Advertisement