రికార్డులు కొల్లగొట్టిన రాజస్తాన్‌ చిన్నోడు! | LSG Mukul Choudhary Creates Unprecedented IPL Records Vs KKR Match | Sakshi
Sakshi News home page

Mukul Choudhary: రికార్డులు కొల్లగొట్టిన రాజస్తాన్‌ చిన్నోడు!

Apr 10 2026 1:34 PM | Updated on Apr 10 2026 1:51 PM

LSG Mukul Choudhary Creates Unprecedented IPL Records Vs KKR Match

Photo Courtesy: IPL 2026

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఎందరో అనామక క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. తాజాగా  లక్నో సూపర్‌జెయిం‍ట్స్ యువ కెరటం ముకుల్ చౌదరి కూడా అదే జాబితాలో చేరాడు. 

గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్‌)తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముకుల్ చౌదరి 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 54 పరుగులు నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి లక్నోకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో ముకుల్ చౌదరి రెండు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డులేంటో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.

  • కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముకుల్ చౌదరి ఏడు సిక్సర్లు బాదాడు. ఏడు లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సిక్సర్లు బాదిన తొలి లక్నో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సీఎస్‌కే ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సరసన చేరాడు. బ్రావో ఐపీఎల్ 2018 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఏడు సిక్సర్లు బాదాడు.

  • ఇదే మ్యాచ్‌లో ముకుల్‌ చౌదరి.. అవేశ్‌ఖాన్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. తద్వారా ఐపీఎల్‌లో టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించిన జట్లలో లక్నోకు 8వ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం అని చెప్పొచ్చు.

  • ఇక లక్నో సూపర్‌జెయింట్స్‌కు కేకేఆర్‌పై ఇది ఐదో విజయం. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో తలపడితే అందులో ఈడెన్ గార్డెన్స్ వేదికగానే లక్నో నాలుగు మ్యాచ్‌లు గెలవడం విశేషం.

చదవండి: భార్యతో కలిసి చెట్టాపట్టాల్‌.. ఐపీఎల్‌కు డుమ్మా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement