మహిళల ప్రపంచకప్-2025 తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడింది. గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లారా భారీ సెంచరీతో చెలరేగింది. 26 ఏళ్ల వోల్వార్డ్ కేవలం 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 169 పరుగులు చేసింది.
ఆమె విధ్వసంకర బ్యాటింగ్ ఫలితంగా సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల మేరకు భారీ స్కోర్ సాధించింది. ఈ తుపాన్ ఇన్నింగ్స్‌తో వోల్వార్ట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
లారా సాధించిన రికార్డులు ఇవే..
👉ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఆమె నిలిచింది.
👉మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా భారత క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ రికార్డును లారా సమం చేసింది. మిథాలీ అత్యధికంగా 13 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించగా.. లారా కూడా సరిగ్గా 13 సార్లు ఏభైకి పైగా పరుగులు చేసింది. అయితే వోల్వార్డ్ కేవలం 23 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.
👉మహిళల వన్డే క్రికెట్‌లో 5000 పరుగులు పూర్తి చేసిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా నిలిచింది.
👉ప్రపంచ కప్ నాకౌట్‌లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన మూడో ప్లేయర్‌గా లారా రికార్డు నెలకొల్పింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(171), ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ(170) తొలి రెండు స్దానాల్లో ఉన్నారు.


