Suranga Lakmal: టీమిండియతో సిరీస్‌ ఆఖరు.. రిటైర్‌ కానున్న స్టార్‌ క్రికెటర్‌

Lanka Cricketer Suranga Lakmal Announce Retirement Series vs IND Last - Sakshi

శ్రీలంక​ మాజీ కెప్టెన్‌ సురంగ లక్మల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. టీమిండియాతో టెస్టు సిరీస్‌ అనంతరం లక్మల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ కానున్నట్లు లంక క్రికెట్‌ బోర్డు బుధవారం ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేసింది. 34 ఏళ్ల లక్మల్‌ 2009లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 12 ఏళ్ల కాలంలో సురంగ లక్మల్‌ లంక తరపున 68 టెస్టుల్లో 168 వికెట్లు, 86 వన్డేల్లో 100 వికెట్లు, 11 టి20ల్లో ఏడు వికెట్లు తీశాడు. లక్మల్‌ తాను  ఆడిన తొలి టెస్టుమ్యాచ్‌లో తొలి బంతికే వికెట్‌ తీసి అరుదైన ఘనత సాధించి ఇమ్రాన్‌ ఖాన్‌, కపిల్‌ దేవ్‌ సరసన నిలిచాడు.

చదవండి: Shahrukh Khan: 'ఏడాది కిందట అర్హత లేదు.. ఇప్పుడు సిద్ధం; ధోనిలా మంచి ఫినిషర్‌ అవడమే లక్ష్యం'

కాగా 2018 కాలంలో లక్మల్‌ శ్రీలంక టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో ఐదు టెస్టులు ఆడింది. లక్మల్‌ కెప్టెన్సీలో లంక జట్టు సౌతాఫ్రికా గడ్డపై 2-0తో టెస్టు సిరీస్‌ను గెలిచింది.  ఆ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచిన తొలి ఆసియా జట్టుగా శ్రీలంక నిలిచింది. ఆ తర్వాత విండీస్‌ గడ్డపై మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇక శ్రీలంక జట్టు ఫిబ్రవరి చివరి వారంలో టీమిండియా పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో లంక జట్టు టీమిండియాతో రెండు టెస్టులు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. 

చదవండి: PSL 2022: 'నా కూతురు కోరిక.. అందుకే వింత సెలబ్రేషన్‌'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top