
టీమిండియా జెర్సీ ధరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తమిళనాడు యువ ఆటగాడు షారుఖ్ ఖాన్ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌కు షారుఖ్ ఖాన్ స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న వేళ షారుఖ్ ఖాన్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు.
''నా ప్రదర్శనతో ఎట్టకేలకు సెలక్టర్ల దృష్టిలో పడ్డాను. టీమిండియాలోకి రావడం ఎలా ఉందని సంవత్సరం క్రితం అడుగుంటే.. నేనప్పటికి సిద్ధంగా లేను కాబట్టి అర్హుడిని కాదు అని చెప్తాను. అదే ప్రశ్న ఇప్పుడు వేస్తే మాత్రం.. నేను టీమిండియా జెర్సీ ధరించడానికి సిద్ధంగా ఉన్నా. ధోని నా అభిమాన ప్లేయర్.. అతనిలా మంచి ఫినిషర్ కావాలనేదే నా లక్ష్యం'' అని షారుఖ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: IPL 2022 Auction: ధోని దృష్టికి జూనియర్ 'మలింగ'.. సీఎస్‌కే దక్కించుకోనుందా!
ఇక తమిళనాడు యంగ్ ప్లేయర్ షారుఖ్ ఖాన్ సంవత్సరం క్రితం వరకు పెద్దగా పరిచయం లేని పేరు. కానీ ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి జరిగిన వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసి ఆశ్యర్యపరిచింది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున 11 మ్యాచ్‌ల్లో 153 పరుగులు సాధించాడు. ఆ తర్వాత జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీని తమిళనాడు గెలవడంతో కీలకపాత్ర పోషించాడు. ఒక మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న షారుఖ్ ఖాన్.. కీలకమైన ఫైనల్లో 15 బంతుల్లో 33 పరుగులు చేసి తనదైన ఫినిషింగ్ టచ్‌తో జట్టుకు టైటిల్ అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తోనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన షారుఖ్ ఖాన్.. విండీస్‌తో సిరీస్‌కు స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. షారుఖ్‌తో పాటు ఆర్. సాయికిషోర్ కూడా ఉన్నాడు. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగావేలంలో షారుఖ్‌ఖాన్‌కు మంచి ధర పలికే అవకాశం ఉంది. అతన్ని దక్కించుకోవడానికి సీఎస్‌కే, ఆర్‌సీబీ ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాయి.
చదవండి: Daryl Mitchell: ఆ ఒక్క నిర్ణయం.. ధోని లాంటి దిగ్గజాల సరసన నిలబెట్టింది