
ఆసియాకప్-2025లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో బంతితో మ్యాజిక్ చేసిన కుల్దీప్.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై కూడా అదే తీరును కనబరిచాడు.
ఆదివారం దుబాయ్ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి పాక్ బ్యాటర్లు ముప్పు తిప్పలు పడ్డారు. ఈ ఎడమ చేతి వాటం స్పిన్నర్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఓ అరుదైన ఫీట్‌ను కుల్దీప్ తన పేరిట లిఖించుకున్నాడు.
భారత్-పాకిస్తాన్ మధ్య టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ రికార్డులెక్కాడు. ఇంతకుముందు వరకు ఈ ఘనత పాక్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ పేరిట ఉండేది. ఆసియాకప్-2022లో భారత్‌పై నవాజ్ 33 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌లో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన కుల్దీప్.. నవాజ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ప్రత్యర్ధి నిర్ధేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా..భిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.
పాక్ బౌలర్లలో అయూబ్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది.
చదవండి: ఏడ్చేసిన షోయబ్ అక్తర్..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్ ఫైర్