గత సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) నిరాశజనక ప్రదర్శన చేసింది. జట్టుగా కేకేఆర్ విఫలమైనా, బ్యాటర్‌గా మాత్రం టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. 14 మ్యాచ్‌ల్లో 390 పరుగులు సాధించి కేకేఆర్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో రహానే సారథ్యంలో 14 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన కేకేఆర్ 8వ స్థానంలో నిలిచి లీగ్ దశలోనే వైదొలగింది.
రహానే తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా జట్టు ఓటములపై ప్రభావం చూపించింది. అయితే ఈసారి మాత్రం ఆ తప్పు చేయకుండా కేకేఆర్ టైటిల్ కొట్టాలని రహానే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ తన ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి మరో నాలుగు రోజులు మిగిలిఉన్న నేపథ్యంలో అన్ని జట్లు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్‌లతో బిజీగా గడుపుతున్నాయి.
సోమవారం రాత్రి కేకేఆర్ జట్టు కూడా ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో రహానే బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. 25 బంతుల్లోనే 58 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్ల నుంచి బ్యాటింగ్‌లో గేర్ మార్చిన రహానే దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లోనూ రహానే అదే జోరు కనబరిచాడు. ఉన్నంతసేపు ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. మరో బ్యాటర్ కామెరున్ గ్రీన్ కూడా 30 బంతుల్లో 52 పరుగులు చేసి వెనుదిరిగాడు.
న్యూజిలాండ్ సంచలనం ఫిన్ అలెన్ కూడా ఉన్నంతసేపు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. గాయపడిన ఆకాశ్‌దీప్ స్థానంలో జట్టులోకి వచ్చిన సౌరబ్ దూబే ఫిన్ అలెన్‌ను వెనక్కి పంపించాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత రహానే నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈడెన్ గార్డెన్‌లో స్పిన్ వనరులను వినియోగించుకోవడంలో విఫలమైన రహానే కెప్టెన్‌గా తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా జట్టుపై ప్రభావం చూపించాయి.
అయితే తాజా సీజన్ ప్రారంభానికి ముందే బ్యాటర్‌గా తానేంటో నిరూపించుకున్న రహానే కెప్టెన్సీలోనూ అదే జోరు చూపించాలని భావిస్తున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.
చదవండి: విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు!


