కేన్‌ విలియమన్స్‌ ప్రపంచ రికార్డు | Kane Williamson, Tom Latham Create World Record In Test Cricket | Sakshi
Sakshi News home page

కేన్‌ విలియమన్స్‌ ప్రపంచ రికార్డు

May 28 2026 1:08 PM | Updated on May 28 2026 1:13 PM

Kane Williamson, Tom Latham Create World Record In Test Cricket

బెల్‌ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి కివీస్ 361 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 

క్రీజులో టామ్ బ్లండెల్(142), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్(38) ఉన్నారు. అంతకంటే ముందు రచిన్‌ రవీంద్ర(121) కూడా సెంచరీతో సత్తాచాటాడు. అయితే ఈ మ్యాచ్‌తో న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్‌లు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 విభిన్న దేశాలలో టెస్ట్ క్రికెట్ ఆడిన తొలి జంటగా వారిద్దరూ రికార్డులెక్కారు.

ఇంతకుముందు ఈ ఇద్దరు ఆటగాళ్లు 11 దేశాలలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడి షేన్ వార్న్, క్రిస్ గేల్, శివనరైన్ చందర్‌పాల్‌లతో పాటు పలువురు పాకిస్తాన్ దిగ్గజ ఆటగాళ్లతో కలిసి సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉండేవారు. కానీ ఈ మ్యాచ్‌లో వారిందరిని కేన్ మామ, లాథమ్ అధిగమించారు. ఈ చారిత్రత్మక మ్యాచ్‌లో విలియమ్సన్ 36 పరుగులు చేసి ఫర్వాలేదన్పించగా.. టామ్ లాథమ్ మాత్రం ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

విలియమ్సన్ 2010లో భారత్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కేన్ వెనక్కి తిరిగి చూడలేదు. 

అతడి కెప్టెన్సీలో కివీస్ తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌(2021) టైటిల్‌ను సొంతం చేసుకుంది. విలియమ్సన్ ఇప్పటివరకు 109 టెస్టుల్లో 9,497 పరుగులు చేశాడు. త్వరలోనే 10,000 పరుగుల మార్కును అతడు అందుకోనున్నాడు.లాథమ్ విషయానికి వస్తే.. అతడు కూడా 2014 ఫిబ్రవరిలో భారత్‌పైనే టెస్ట్ అరంగేట్రం చేశాడు.. ఇప్పటివరకు 92 టెస్టులు ఆడిన లాథమ్ 16 సెంచరీలు, 31 అర్ధసెంచరీలతో 6,261 పరుగులు సాధించాడు.
చదవండి: IPL 2026: 'ఆ సీక్రెట్‌ ఐపీఎల్ అయిపోయాక చెప్తా'

Advertisement
 
Advertisement
Advertisement