ఐపీఎల్-2026లో ముల్లాన్‌పూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని వైభవ్ కోల్పోయాడు. అతడి విధ్వంసం ఫలితంగా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 243 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అనంతరం లక్ష్య చేధనలో సన్‌రైజర్స్ 196 పరుగులకే ఆలౌటైంది. రాజస్తాన్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. వైభవ్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌పై సహచర ఆటగాళ్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. మ్యాచ్ అనంతరం వైభవ్‌పై తన సహచరడు, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"అతడు బ్యాటింగ్ చూడాటానికి చాలా బాగుంటుంది. అతడు ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే.. మాకు డిఫెండ్ చేయడానికి అన్ని ఎక్కువ పరుగులు లభిస్తాయి. వైభవ్ 150 పరుగులు కూడా చేయగలడన్న నమ్మకం నాకు ఉంది" అని ఆర్చర్ అన్నాడు. అదేవిధంగా వైభవ్‌ను ఆడ్డుకోవాలంటే ఎలా బౌలింగ్ చేయాలన్న ప్రశ్నకు ఆర్చర్‌కు ఎదురైంది.
అందుకు బదులుగా.. వైభవ్‌ను ఎలా ఔట్ చేయాలో నాకు తెలుసు. కానీ అది ఐపీఎల్ ముగిసిన తర్వాత చెప్తాను అని ఆర్చర్ సరదాగా సమాధనమిచ్చాడు. కాగా ఈ ఏడాది సీజన్ ఆరెంజ్ క్యాప్ రేసులో వైభవ్ సూర్యవంశీ(680) అగ్రస్ధానంలో ఉన్నాడు. మే 29న రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2026: వైభవ్‌ను సూర్యవంశీని వెతికి తీసుకొచ్చింది ఇతడే


