భారత్‌తో రెండో టీ20.. ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన! యువ ప్లేయర్‌కు చోటు | Jofra Archer Returns As England Name Playing XI For 2nd T20I Vs India | Sakshi
Sakshi News home page

భారత్‌తో రెండో టీ20.. ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన! యువ పేసర్‌కు చోటు

Jul 3 2026 9:25 PM | Updated on Jul 3 2026 9:35 PM

Jofra Archer Returns As England Name Playing XI For 2nd T20I Vs India

మాంచెస్ట‌ర్ వేదిక‌గా శ‌నివారం భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న రెండో టీ20 కోసం ఇంగ్లండ్ త‌మ తుది జ‌ట్టును ప్ర‌క‌టించింది. తొలి టీ20కు విశ్రాంతి తీసుకున్న స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ తిరిగి ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి వ‌చ్చాడు. పేసర్లు ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్ స్థానాల్లో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్‌లకు తుది జట్టులో చోటు దక్కింది.

ఈ మ్యాచ్‌తో జోష్ టంగ్ ఇంగ్లండ్ త‌ర‌పున టీ20 అరంగేట్రం చేయ‌నున్నాడు. టంగ్‌ ఇప్పటికే టెస్ట్‌ జట్టులో రెగ్యులర్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.  ఈ రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ ఇప్పటివరకు ఇంగ్లండ్‌ తరపున 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. టీ20ల్లో మాత్రం అతడికి పెద్దగా అనుభవం లేదు. ఇప్పటివరకు కేవలం 21 టీ20లు మాత్రమే ఆడాడు. అతడి పేరిట 29 టీ20 వికెట్లు ఉన్నాయి.

సాకిబ్‌పై వేటు
కాగా తొలి మ్యాచ్‌లో సాకిబ్ మహమూద్ 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టినప్పటికి.. ఆర్చర్ కోసం అతన్ని పక్కన పెట్టడం గమనార్హం. 2026 టీ20 ప్రపంచకప్ తర్వాత ఆర్చర్‌కు ఇదే మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌. కచ్చితంగా పవర్‌ప్లేలో అతడి నుంచి భారత బ్యాటర్లకు కఠిన సవాల్‌ ఎదురు కానుంది.

ఇంగ్లండ్‌ తుది జట్టు
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement