
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన పునరాగమనాన్ని ఘనంగా ఆరంభించాడు. నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి వచ్చిన ఆర్చర్.. తన వేసిన తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టి సత్తాచాటాడు. లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌కు ఆదిరిపోయే ఆరంభాన్ని ఆర్చర్ అందించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో తన వేసిన మొదటి ఓవర్‌లోనే స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్(13)ను ఔట్ చేసి టీమిండియాకు షాకిచ్చాడు. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ఆర్చర్.. మూడో బంతిని జైశ్వాల్‌కు 145 కి.మీ వేగంతో సీమ్ ఆప్ డెలివరీగా సంధించాడు.
ఆఫ్ స్టంప్ దిశగా పడిన బంతిని జైశ్వాల్ బ్యాక్ ఫుట్ నుంచి లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ చేతికి వెళ్లింది. దీంతో 1596 రోజుల తర్వాత అతడి ఖాతాలో తొలి టెస్టు వికెట్ చేరింది.
ఆర్చర్ చివరగా 2021లో ఇంగ్లండ్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఏడాది క్రితం వైట్‌బాల్ జట్టులోకి వచ్చినప్పటికి.. టెస్టుల్లో మాత్రం ఆడడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి.
ఇంగ్లండ్ స్కోరంతంటే?
తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. 251/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు.. అదనంగా 136 పరుగులు చేసి ఆలౌటైంది. జో రూట్(104) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.
Pace is pace man, Jaiswal had no reply to Jofra Archer.
He is making a comeback after long 4 years & bowled as if he never gone anywhere. True cricket fans missed 4 years of peak Archer, god please bless him now for next few years❤️🧿pic.twitter.com/aSrOEdqe2B— Rajiv (@Rajiv1841) July 11, 2025