IPL 2026: రాజస్తాన్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం | IPL 2026: Sunrisers Hyderabad Vs Rajasthan Royals Match Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2026: రాజస్తాన్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం

Apr 13 2026 7:04 PM | Updated on Apr 13 2026 11:19 PM

IPL 2026: Sunrisers Hyderabad Vs Rajasthan Royals Match Live Updates

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు వరుస ఓటములకు చెక్ పెట్టింది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ప్రఫుల్ హెంగే, ష​కీబ్ హుస్సేన్ సంచలన బౌలింగ్‌కు తోడు ఇషాన్ కిషన్ రాణించడంతో ఎస్‌ఆర్‌హెచ్ సునాయసంగా గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ప్రఫుల్‌ హెంగే, సాకిబ్‌లు చెరో 4 వికెట్లతో మెరిశారు.

ఫెరీరా అర్థసెంచరీ..
రాజస్తాన్‌ రాయల్స్‌ 14 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. డొనోవన్‌ ఫెరీరా అర్థసెంచరీ సాధించాడు. ప్రస్తుతం ఫెరీరా (63 బ్యాటింగ్‌), జడేజా (43 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్‌ రాయల్స్‌ 5 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో జడేజా (21 బ్యాటింగ్‌), ఫెరీరా (24 బ్యాటింగ్‌) ఉన్నారు. 

ఐదో వికెట్‌ డౌన్‌
ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ పేలవ ఆటతీరు కనబరుస్తోంది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 10 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. ఫ్రపుల్‌ హింగే బౌలింగ్‌లో 4 పరుగులు చేసిన పరాగ్‌ అభిషేక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 4 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన షాకిబ్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ (1) నితీశ్‌రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

తొలి ఓవర్లోనే మూడు వికెట్లు..
217 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ ఫ్రపుల్‌ హెంగే తన తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. వైభవ్‌ సూర్యవంశీ గోల్డెన్‌ డక్‌ కాగా.. ధ్రువ్‌ జురేల్‌,, ప్రిటోరియస్‌ డకౌట్‌గా వెనుదిరిగారు. దీంతో ఒక్క పరుగు వద్దే రాయల్స్‌ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

రాజ‌స్తాన్ ల‌క్ష్యం 217 పరుగులు
ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌.. రాజస్తాన్‌ ముంగిట 217 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 216 ప‌రుగులు చేసింది. ఇషాన్ కిష‌న్ 91 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా, క్లాసెన్ 40 ప‌రుగులు చేశాడు.

చివర్లో సాహిల్‌ అరోరా (24 నాటౌట్‌) మెరిశాడు. ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్‌లు పూర్తిగా నిరాశ‌ప‌రిచారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ఆర్చ‌ర్ 2 వికెట్లు తీయ‌గా, సందీప్ శ‌ర్మ‌, తుసషార్ దేశ్ పాండే, ప‌రాగ్ త‌లా ఒక వికెట్ తీశారు.

నాలుగో వికెట్‌ డౌన్‌
హెన్రిచ్‌ క్లాసెన్‌ (40) రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. తుషార్‌ దేశ్‌ పాండే బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన క్లాసెన్‌ పరాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 

ఇషాన్‌ కిషన్‌ ఔట్‌ 
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న ఇషాన్‌ కిషన్‌ (91) సందీప్‌ శర్మ బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్డ్‌ గా వెనుదిరిగాడు.  ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.

13 ఓవర్లకు ఎస్‌ఆర్‌ఎస్‌ హెచ్‌ స్కోరు: 140/2

హాఫ్‌ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్‌ కిషన్‌
ఇషాన్ కిషన్ హఫ్‌ సెంచరీతో అదరొగట్టాడు. కేవలం 30 బంతుల్లో 50 పరుగుల చేశాడు. డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ కొట్టిన ఇషాన్‌ కిషన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

హెడ్‌ ఔట్‌.. రెండో వికెట్‌ డౌన్‌
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ రియాన్‌ పరాగ్‌ బౌలింగ్‌లో డొనొవన్‌ ఫెరీరాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. 

ఆరు ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు 51/1
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ గోల్డెన్‌ డక్‌ అయినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ దూకుడుగా ఆడుతున్నాడు. ఆరు ఓవర్లు​ ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ నష్టానికి 51 పరుగులు చేసింది. ఇషాన్‌ (35 బ్యాటింగ్‌), హెడ్‌ (11 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఆదిలోనే ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టి షాక్‌ తగిలింది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన తొలి ఓవర్‌ మొదటి బంతికి భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో అభిషేక్‌ శర్మ రవి బిష్ణోయ్‌ క్యాచ్‌  ఇచ్చి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు.

 టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌
ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో మ‌రో ఆస‌క్తికర పోరుకు తెరలేచింది. ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన రాజ‌స్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగింది. బ్రిజేష్ పటేల్ స్థానంలో తుషార్ దేశ్ పాండే, హెట్‌మైర్ స్థానంలో ప్రిటోరియస్ తుది జట్టులోకి వచ్చారు. 

కాగా ప్రిటోరియస్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి మ్యాచ్‌. మ‌రోవైపు ఎస్ఆర్‌హెచ్ కూడా రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. ఉనాద్క‌ట్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌లను త‌ప్పించిన‌ట్లు ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిష‌న్ తెలిపాడు. ఇక ముఖాముఖి పోరులో ఎస్ఆర్‌హెచ్‌దే పైచేయి. ఇరుజ‌ట్ల మ‌ధ్య 21 మ్యాచ్‌లు జ‌ర‌గ్గా ఎస్ఆర్‌హెచ్ 12 మ్యాచ్‌ల్లో, రాజ‌స్తాన్ 9 మ్యాచ్‌ల్లో విజ‌యాలు సాధించాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్‌/ కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగ.

రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), లువాన్-డ్రే ప్రిటోరియస్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే.

 

Advertisement
 
Advertisement
Advertisement