శుబ్‌మన్‌ గిల్‌కు ‘ఊహించని’ షాక్‌! | IPL 2026: Shubman Gill Faces Punishment After GT Narrow Win Over DC | Sakshi
Sakshi News home page

శుబ్‌మన్‌ గిల్‌కు ‘ఊహించని’ షాక్‌!

Apr 9 2026 10:50 AM | Updated on Apr 9 2026 11:01 AM

IPL 2026: Shubman Gill Faces Punishment After GT Narrow Win Over DC

గుజరాత్‌ టైటాన్స్‌ ఎట్టకేలకు ఐపీఎల్‌-2026 టోర్నీలో బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఢిల్లీ హిట్టర్‌ డేవిడ్‌ మిల్లర్‌ (20 బంతుల్లో 41 నాటౌట్‌) చేసిన పొరపాటు టైటాన్స్‌ నెత్తిన పాలు పోసింది. ఫలితంగా ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో టైటాన్స్‌ను విజయం వరించింది.

ధనాధన్‌
సొంతమైదానం అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా టాస్‌ గెలిచిన ఢిల్లీ.. గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్‌ నాలుగు వికెట్లు నష్టపోయి 210 పరుగులు సాధించింది. శుబ్‌మన్‌ గిల్‌ (45 బంతుల్లో 70) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరవగా.. జోస్‌ బట్లర్‌ (27 బంతుల్లో 52), వాషింగ్టన్‌ సుందర్‌ (32 బంతుల్లో 55) ధనాధన్‌ దంచికొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగుల వద్ద నిలిచిపోయింది. పాతుమ్‌ నిస్సాంక (24 బంతుల్లో 41), కేఎల్‌ రాహుల్‌ (52 బంతుల్లో 92), మిల్లర్‌ ఇన్నింగ్స్‌ వృథా అయ్యాయి. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ మూడు వికెట్లు తీయగా.. ప్రసిద్‌ కృష్ణ రెండు, మహ్మద్‌ సిరాజ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

శుబ్‌మన్‌ గిల్‌కు ఊహించని షాక్‌
అయితే, గెలుపు జోష్‌లో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఢిల్లీతో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున ఐపీఎల్‌ పాలక మండలి అతడికి జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది.

‘‘ఐపీఎల్‌-2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా గుజరాత్ టైటాన్స్‌ స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసింది. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.22 ప్రకారం.. గుజరాత్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌కు జరిమానా విధించడమైనది. ఈ సీజన్‌లో ఇదే అతడి తొలి తప్పిదం కాబట్టి రూ. 12 లక్షల జరిమానాతో సరిపెడుతున్నాము’’ అని ఐపీఎల్‌ పాలక మండలి ప్రకటనలో పేర్కొంది. 

చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్‌.. అక్షర్‌ పటేల్‌ రియాక్షన్‌ ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement