టీమిండియా స్టార్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. వారిద్దరూ తమ స్పిన్ మయాజాలంతో ఎన్నో మ్యాచ్‌ల్లో భారత జట్టుకు అద్భుతమైన విజయాలను అందించారు.
ఆన్‌ది ఫీల్డ్ గానీ, ఆఫ్ ది ఫీల్డ్ గానీ ఈ స్పిన్ ద్వయం చాలా సరదాగా ఉంటారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన కుల్దీప్ యాదవ్ పెళ్లికి కూడా హాజరై జడ్డూ సందడి చేశాడు. అయితే తాజాగా మరోసారి వారి మధ్య ఉన్న స్నేహం బయటపడింది.
ఏమి జరిగిందంటే?
ఐపీఎల్-2026లో శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో జడ్డూ రాజస్తాన్ రాయల్స్‌కు, కుల్దీప్ ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే రాజస్తాన్ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ధ్రువ్ జురెల్ ఔటయ్యాక రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి వచ్చాడు.
మైదానంలోకి వచ్చిన జడ్డూ తన బ్యాట్‌ను చెక్ చేసుకునేందుకు అంపైర్ వద్దకు వెళ్తుండగా.. పక్కనే ఉన్న కుల్దీప్ సరదాగా ఏదో అన్నాడు. అందుకు బదులుగా జడ్డూ తన బ్యాట్‌ను గాలిలో ఊపుతూ కొడతా అన్నట్లు సైగలు చేశాడు. అయితే ఏమాత్రం బెదరని కుల్దీప్, నవ్వుతూ జడేజా భుజాలపై చేతులు వేసి వెనక్కి నెట్టేశాడు.
దీంతో పక్కన ఉన్న నితీష్ రాణా సైతం నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ తమ ప్లే ఆశలను సజీవంగా ఉంచుకుంది.
చదవండి: IPL 2026: వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. కట్ చేస్తే! భారీ షాకిచ్చిన బీసీసీఐ
𝙈𝙖𝙨𝙩𝙞 𝙧𝙪𝙠𝙣𝙞 𝙣𝙖𝙝𝙞 𝙘𝙝𝙖𝙝𝙞𝙮𝙚...
Kuldeep Yadav & Ravindra Jadeja shared a fun moment in the middle of the game. 😅#TATAIPL 2026 ➡️ #RRvDC | LIVE NOW 👉https://t.co/cMKydi0l80 pic.twitter.com/6EijsAT5Nd— Star Sports (@StarSportsIndia) May 1, 2026


