ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 12) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌ను వారి సొంత ఇలాకాలో చిత్తుగా ఓడించింది. ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆర్సీబీకి భారీ స్కోర్ అందించారు. ఛేదనలో తడబడిన ముంబై, లక్ష్యానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
విజయానంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన, వ్యక్తిగత ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబైలో ఆడటాన్ని గొప్ప ఆనుభూతిగా పేర్కొన్నాడు. విరాట్ గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు.
రజత్ మాటల్లో.. ముంబైలో, ప్రత్యేకంగా వాంఖడే మైదానంలో ఆడటం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడి అభిమానులు, వాతావరణం, ఫుల్–ప్యాక్ స్టేడియంలో ఆడటం వేరే లెవెల్ ఫీలింగ్ ఇస్తుంది.
ఈ మ్యాచ్‌లో జట్టు ప్రదర్శన సంతృప్తిని కలిగించింది. విరాట్ భాయ్, ఫిల్ సాల్ట్ మంచి ఆరంభాన్ని ఇచ్చి మాకు డ్రైవింగ్ సీట్ ఇచ్చారు. అందుకే నేను, టిమ్ స్వేచ్ఛగా షాట్లు ఆడగలిగాము. ఇది పూర్తిగా టీమ్ ఎఫర్ట్.
చాలామంది నేను స్పిన్ బౌలింగ్‌ను బాగా ఆడగలనని అనుకుంటారు. కానీ నిజానికి నాకు ఫాస్ట్ బౌలింగ్ ఆడటం చాలా ఇష్టం. అందులోనే నేను సౌకర్యవంతంగా ఆడగలను. ఈ పిచ్‌లో పేసర్లపై ఎదుర్కోవడం చాలా బాగుంది.
విరాట్ భాయ్ గాయంపై నాకు పూర్తి సమాచారం లేదు. కానీ ఆయన బాగానే ఉన్నారని అనిపిస్తోంది.
రజత్ మాటలను బట్టి చూస్తే.. జట్టు ప్రదర్శనపై అతను చాలా సంతృప్తిగా ఉన్నాడు. భయం లేకుండా బ్యాటింగ్ చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాడు. స్పిన్నర్ల కంటే పేసర్లనే మెరుగ్గా హ్యాండిల్ చేయగలనన్న విషయాన్ని స్పష్టం చేశాడు.
కాగా, ఎంఐతో మ్యాచ్‌ను ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసే సమయంలోనే తమ ఖాతాలో వేసుకుంది. సాల్ట్, విరాట్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చి పవర్ ప్లేలోనే మ్యాచ్ ఫేట్‌ను డిసైడ్ చేసేశారు. ఆతర్వాత రజత్, టిమ్ బ్యాటింగ్ ధాటి ఆర్సీబీ గెలుపును ఖరారు చేసింది.
బౌలర్లు పెద్దగా రాణించకపోయినా, అది చేసిన భారీ స్కోర్ వల్ల వచ్చిన ధీమా మాత్రమే. మొత్తంగా ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గ ప్రదర్శనలు చేస్తూ, ప్రస్తుత సీజన్‌లోనూ టైటిల్ దిశగా సాగుతోంది.
ముంబై-ఆర్సీబీ మ్యాచ్ వివరాలు..
ఆర్సీబీ- 240/4(20)
ముంబై ఇండియన్స్- 222/5(20)
18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: ఫిల్ సాల్ట్
కీలక ప్రదర్శనలు
ఆర్సీబీ- ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్), కృనాల్ పాండ్యా (4-0-26-1)
ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్యా (4-0-39-1), రూథర్‌ఫోర్డ్ (71 నాటౌట్)


