ఆర్సీబీ ఘన విజయం | IPL 2026 Match 39: RCB VS DC Highlights | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ ఘన విజయం

Apr 27 2026 7:04 PM | Updated on Apr 27 2026 9:59 PM

IPL 2026 Match 39: RCB VS DC Highlights

ఆర్సీబీ ఘన విజయం
ఢిల్లీ నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఊదేసింది. 20 పరుగులు చేసి జేకబ్‌ బేతెల్‌ ఔట్‌ కాగా.. పడిక్కల్‌ (34 నాటౌట్‌), విరాట్‌ కోహ్లి (23 నాటౌట్‌) ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.బేతెల్‌ వికెట్‌ జేమీసన్‌కు దక్కింది. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
2.5వ ఓవర్‌- 76 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 26 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. జేమీసన్‌ బౌలింగ్‌లో నటరాజన్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో జేకబ్‌ బేతెల్‌ (20) ఔటయ్యాడు. 

75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌ (3-0-5-3), హాజిల్‌వుడ్‌ (3.3-0-12-4) చెలరేగడంతో 75 పరుగులకే కుప్పకూలింది. భువీ, హాజిల్‌కు రసిక్‌ (2-0-21-1), సుయాశ్‌ (4-1-7-1), కృనాల్‌ (2-0-9-1) తోడవడంతో ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కూలింది. 

ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అభిషేక్‌ పోరెల్‌ (30) పుణ్యమే. అతనితో పాటు డేవిడ్‌ మిల్లర్‌ (19), జేమీసన్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో సాహిల్ పరాఖ్‌, సమీర్‌ రిజ్వి, అక్షర్‌ పటేల్‌ డకౌట్లు కాగా.. కేఎల్‌ రాహుల్‌, నితీశ్‌ రాణా తలో పరుగు చేశారు. స్టబ్స్‌ 5, కుల్దీప్‌ 3 పరుగులు చేశారు. 

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
12.3వ ఓవర్‌- 62 పరుగుల వద్ద ఢిల్లీ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో జేమీసన్‌ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 

ఏడో వికెట్‌ డౌన్‌
8.6వ ఓవర్‌- 43 పరుగుల వద్ద ఢిల్లీ ఏడో వికెట్‌ కోల్పోయింది. రసిక్‌ సలాం బౌలింగ్‌లో జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి డేవిడ్‌ మిల్లర్‌ (19) ఔటయ్యాడు.

ఆరో వికెట్‌ డౌన్‌
3.5వ ఓవర్‌- ఆర్సీబీ పేసర్లు చెలరేగిపోతున్నారు. 8 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో నితీశ్‌ రాణా (1) ఔటయ్యాడు. 

7 పరుగులకే సగం వికెట్లు డౌన్‌
2.4వ ఓవర్‌- 7 పరుగుల వద్దే ఢిల్లీ ఐదో వికెట్‌ కూడా కోల్పోయింది. భువీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి అక్షర్‌ పటేల్‌ () ఔటయ్యాడు. 

7 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
2.1వ ఓవర్‌- ఢిల్లీ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. భువీ బౌలింగ్‌లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (5) ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 7 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది.

పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే భారీ షాక్‌లు తగిలాయి. రెండో బంతికే భువీ సాహిల్‌ పారఖ్‌ (0), రెండో ఓవర్‌ తొలి బంతికే కేఎల్‌ రాహుల్‌ను (1), రెండో బంతికి సమీర్‌ రిజ్విని (0) హాజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. 

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 27) జరుగుతున్న 39వ మ్యాచ్‌లో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ రెండో స్థానంలో, ఢిల్లీ ఏడో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ఢిల్లీకి ఇకపై ప్రతి మ్యాచ్‌ కీలకమే. 

తుది జట్లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): సాహిల్ పరాఖ్, కేఎల్ రాహుల్(w), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(సి), దుష్మంత చమీరా, కైల్ జామీసన్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement