రాణించిన ప్రసిద్ద్‌, గిల్‌, బట్లర్‌.. లక్నోను చిత్తు చేసిన గుజరాత్‌ | IPL 2026: Gujarat Titans beat LSG | Sakshi
Sakshi News home page

రాణించిన ప్రసిద్ద్‌, గిల్‌, బట్లర్‌.. లక్నోను చిత్తు చేసిన గుజరాత్‌

Apr 12 2026 7:16 PM | Updated on Apr 12 2026 7:16 PM

IPL 2026: Gujarat Titans beat LSG

ఐపీఎల్‌ 2026లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 12) మధ్యహ్నం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో ని​ర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

ప్రసిద్ద్‌ కృష్ణ (4-0-28-4), అశోక్‌ కుమార్‌ (4-0-32-2), సిరాజ్‌ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్‌ చేసి లక్నోను కట్టడి చేశారు. రబాడ (4-0-54-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. రషీద్‌ ఖాన్‌ (4-0-25-0) వికెట్‌ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. లక్నో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన మార్క్రమ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా ఆటగాళ్లలో మిచెల్‌ మార్ష్‌ 11, పంత్‌ 18, బదోని 9, పూరన్‌ 19, అబ్దుల్‌ సమద్‌ 18, ముకుల్‌ ఛౌదరి 18, జార్జ్‌ లిండే 16, షమీ 12 (నాటౌట్‌), ఆవేశ్‌ ఖాన్‌ 4 (నాటౌట్‌) పరుగులు చేశారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ 18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. శుభ్‌మన్‌ గిల్‌ (56), బట్లర్‌ (60) అర్ద సెంచరీలతో రాణించి గుజరాత్‌ను గెలిపించారు. ఆఖర్లో వాషింగ్టన్‌ సుందర్‌ (21 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించి వేగంగా మ్యాచ్‌ను ముగించాడు. మిగతా ఆటగాళ్లలో సాయి సుదర్శన్‌ 15, తెవాతియా 10 (నాటౌట్‌) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో షమీ, ప్రిన్స్‌ యాదవ్‌, దిగ్వేష్‌ రాఠీ తలో వికెట్‌ తీశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement