విజయంతో ముగించిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ | IPL 2026: Delhi Capitals Beat KKR By 40 Runs In Last Group Game | Sakshi
Sakshi News home page

విజయంతో ముగించిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

May 24 2026 11:37 PM | Updated on May 25 2026 10:04 AM

IPL 2026: Delhi Capitals Beat KKR By 40 Runs In Last Group Game

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యంతో ముగించింది. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌డంతో కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్ నామమాత్రంగా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో ఆదివారం కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన సీజన్ చివ‌రి మ్యాచ్‌లో కేకేఆర్‌పై  ఢిల్లీ క్యాపిట‌ల్స్ 40 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. 

204 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్ 18.4 ఓవ‌ర్ల‌లో  163 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కెప్టెన్ అజింక్య ర‌హానే (63) అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా, పావెల్ (29), మ‌నీశ్ పాండే (25) ప‌ర్వాలేద‌నిపించారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్‌, ఎన్గిడి చెరో మూడు వికెట్ల‌తో విజృంభించ‌గా, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60) అర్థ‌సెంచ‌రీతో త‌న ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ (39), డేవిడ్ మిల్ల‌ర్ (28), అశుతోశ్ శ‌ర్మ (18 నాటౌట్‌) రాణించ‌డంతో ఢిల్లీ 200 ప‌రుగుల మార్క్‌ను దాటింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో సౌర‌భ్ దూబే 2 వికెట్లు తీయ‌గా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అనుకుల్ రాయ్‌, సునీల్ న‌రైన్‌లు త‌లా ఒక వికెట్ ప‌డగొట్టారు. 

కేకేఆర్‌పై విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో సీజన్‌ను ఆరో స్థానంతో ముగించింది.  మరోవైపు కేకేఆర్ 14 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. ఇక రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంతో పంజాబ్‌, కేకేఆర్‌లు ఇంటిదారి పట్టాయి.

చదవండి: ‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement