శతక్కొట్టిన సంజూ.. బోణీ కొట్టిన సీఎస్‌కే | IPL 2026: Chennai register maiden win of season | Sakshi
Sakshi News home page

IPL 2026: శతక్కొట్టిన సంజూ.. బోణీ కొట్టిన సీఎస్‌కే

Apr 11 2026 11:33 PM | Updated on Apr 11 2026 11:33 PM

 IPL 2026: Chennai register maiden win of season

ఐపీఎల్‌-2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది.  213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.

ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్‌(60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫాథుమ్‌ నిస్సాంక(41), అశుతోష్‌ శర్మ(19) రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్‌ మూడు, నూర్‌ అహ్మద్‌, ఖలీల్‌ తలా వికెట్‌ సాధించారు.

సంజూ సూపర్ సెంచరీ
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ కేవలం 52 బంతుల్లోనే తన నాలుగో ఐపీఎల్‌ సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా సంజూ 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఆయూశ్ మాత్రే(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు.
చదవండి: IPL 2026: చెలరేగిన శాంసన్.. చెపాక్‌లో సూపర్‌ సెంచరీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement