ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్( కేకేఆర్) హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. గురువారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపు దిశగా సాగింది. అయితే చివర్లో ముకుల్ చౌదరీ సైందవుడిలా అడ్డుపడి ఒంటిచేత్తో కేకేఆర్ నుంచి గెలుపును లాగేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మ్యాచ్ ఓటమిపై స్పందించాడు.
'ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. కానీ మా కుర్రాళ్లు ఆడిన తీరు అమోఘం. ముకుల్ ఆడిన ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అతను షాట్లు ఆడిన తీరు అమోఘం. ఇలాంటి మ్యాచ్‌ల్లో తప్పులను వెతకకూడదు. మా ప్రణాళికల అమల్లో చిన్న చిన్న లోపాలు జరిగి ఉండొచ్చు. కానీ ముకుల్ ఆడిన తీరుకు, అతడి ఇన్నింగ్స్‌కు క్రెడిట్ ఇచ్చి తీరాల్సిందే.
పిచ్‌పై స్లో బంతులు బాగానే పనిచేశాయి. అందుకే ప్రతి బంతిని బాదడానికి ప్రయత్నించారు. ముకుల్ షాట్లు మాత్రం అద్భుతం. మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చిందనుకున్న దశలో ముకుల్‌చౌదరీ సూపర్ ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో మా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు.
ఈ వికెట్‌పై 180-185 అనేది మంచి స్కోరు. ఏది ఏమైనా లక్నో బ్యాటర్లు ఆడిన తీరును మెచ్చుకోవాల్సిందే. ఆఖరి ఓవర్‌లో ఆవేష్ ఖాన్‌నే ఎక్కువ సేపు స్ట్రైకింగ్‌లో ఉంచాలని ఫీల్డింగ్ ముందుకు పెట్టాం. కానీ స్లో ఓవర్ రేట్ కారణంగా ఐదుగురు ఫీల్టర్లు సర్కిల్ లోపల ఉన్నప్పుడు చివరి ఓవర్ వేయడం బౌలర్లకు కష్టమే.
అయితే ఈ ఓటమిపై విశ్లేషించుకుంటాం. లోపాలు సరిచేసుకుంటాం. రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగ్గా ఎలా ఆడాలనే విషయాన్ని ఆలోచిస్తాం.'అని రహానే పేర్కొన్నాడు. కేకేఆర్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.


