Ben Stokes: అడుగుపెట్టిన కాసేపటికే బరిలోకి.. బ్యాట్‌తో విధ్వంసం

IPL 2023: Ben Stokes Working On Six-Hitting Tactic CSK Practice Session - Sakshi

ఐపీఎల్‌ 2023 సీజన్‌ ప్రారంభానికి ఇంకా ఆరు రోజులే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. నాలుగుసార్లు ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ కూడా అందరికంటే ముందుగానే ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది. శుక్రవారం ఇంగ్లండ్‌ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ రాకతో సీఎస్‌కే క్యాంప్‌లో మరింత జోష్‌ వచ్చింది. స్టోక్స్‌ చెన్నైలో అడుగుపెట్టిన వీడియోనూ సీఎస్‌కే తన ట్విటర్‌లో షేర్‌ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది.

అయితే స్టోక్స్‌ వచ్చీ రాగానే ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. అస్సలు సమయం వృథా చేయకూడదనే కాన్సెప్ట్‌తో వచ్చాడనుకుంటా.. గ్రౌండ్‌లో అడుగుపెట్టిందే మొదలు సిక్సర్ల వర్షం కురిపించాడు. మార్చి 24న చెన్నైలో అడుగుపెట్టిన స్టోక్స్‌ అదే రోజు సాయంత్రం సెంటర్‌-పిచ్‌లో తన ప్రాక్టీస్‌ కొనసాగించాడు. నెట్‌ బౌలర్స్‌ సంధించిన బంతులను స్టోక్స్‌ చాలావరకు బౌండరీ అవతలకు పంపించాడు. స్టోక్స్‌ ప్రాక్టీస్‌ వీడియోనూ సీఎస్‌కే తన ట్విటర్‌లో షేర్‌ చేసుకుంది. బెన్‌.. డెన్‌ #Super Force అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

ఇక బెన్‌ స్టోక్స్‌ను గతేడాది జరిగిన మినీవేలంలో సీఎస్‌కే రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్ల సరసన స్టోక్స్‌ నిలిచాడు. మరోవైపు ఎంఎస్‌ ధోనికి ఇదే చివరి సీజన్‌ అని భావిస్తున్న తరుణంలో స్టోక్స్‌కు కెప్టెన్సీ అప్పగించే అవకాశాలున్నాయంటూ రూమర్లు వస్తున్నాయి. అయితే స్టోక్స్‌ ఐపీఎల్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సంప్రదాయ క్రికెట్‌కు ఎక్కువ విలువనిచ్చే స్టోక్స్‌ దృష్టి ఈ ఏడాది చివర్లో జరగనున్న యాషెస్‌ సిరీస్‌పై దృష్టి పెట్టాడు. మార్చి 31న డిపెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో సీఎస్‌కే తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌ 16వ సీజన్‌కు తెరలేవనుంది.

చదవండి: క్రికెట్‌లో 13 మ్యాచ్‌లు ఫిక్సింగ్‌.. టీమిండియా సేఫ్‌!

పాపం తగలరాని చోట తగిలి..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top