European Cricket: పాపం తగలరాని చోట తగిలి..

క్రికెట్‌లో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు అయ్యో పాపం అనుకుంటాం. తాజాగా ఒక బ్యాటర్ పరుగు తీస్తున్న క్రమంలో ఫీల్డర్ వేసిన బంతి తగలరాని చోట తగిలి నానా ఇబ్బంది పడ్డాడు. ఈ ఘటన యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో చోటుచేసుకుంది.
విషయంలోకి వెళితే.. బ్రదర్స్ ఎలెవెన్, ఇండియన్ రాయల్స్ మధ్య 10 ఓవర్ల మ్యాచ్ జరిగింది. ఇండియన్ రాయల్స్ ఇన్నింగ్స్ సమయంలో క్రీజులో ఉన్న బ్యాటర్ మిడాన్ దిశగా ఆడాడు. సింగిల్ పూర్తి చేశారు.. అయితే ఫీల్డర్ మిస్ ఫీల్డ్ చేయడంతో రెండో పరుగు కోసం పరిగెత్తారు. ఈ క్రమంలో బంతిని అందుకున్న ఫీల్డర్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తిన బ్యాటర్ వైపు విసిరాడు.
అయితే ఎవరు ఊహించని రీతిలో బంతి వచ్చి పొట్ట కింద భాగంలో తగిలింది. దెబ్బ గట్టిగానే తగిలిందనుకుంటా పాపం నొప్పితో కాసేపు విలవిల్లాడాడు. గార్డ్ వేసుకోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన బ్రదర్స్ ఎలెవెన్ నిర్ణీత 10 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. బల్వీందర్ సింగ్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ రాయల్ ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం పడే సమయానికి ఇండియన్ రాయల్స్ మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులతో ఆడుతుంది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఇరుజట్ల స్కోర్లు సమానంగా ఉండడంతో గోల్డెన్ బాల్‌కు అవకాశం ఇచ్చారు. గోల్డెన్ బాల్‌లో బ్రదర్స్ ఎలెవెన్ జట్టు విజయం సాధించింది.
Timeline cleanser. Sound on for maximum dopamine injection.
— Georgie Parker (@georgieparker) March 23, 2023
చదవండి: ఇంగ్లండ్ బౌలర్ చరిత్ర.. డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు