
ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత-ఎ జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. అంత ఊహించనట్టుగానే ఆసీస్-ఎ సిరీస్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆడడం లేదు. తొలుతు ఆసీస్ పర్యటనకు ముందు సన్నాహాల్లో భాగంగా ఈ అనాధికారిక సిరీస్‌లో రో-కో ద్వయం ఆడనున్నట్లు వార్తలు వినిపించాయి.
కానీ ఈ సిరీస్ కోసం సెలక్టర్లు ప్రకటించిన తాజా స్క్వాడ్‌లో వీరిద్దరి పేర్లు లేకపోవడంతో అవన్నీ వట్టి రూమర్సే అని రుజువైంది. ఈ సిరీస్ కోసం రెండు వెర్వేరు జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. తొలి వన్డే కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును మాత్రమే బీసీసీఐ సెలక్ట్ చేసింది.
ఆస్ట్రేలియా-ఎతో జరిగే తొలి వన్డేలో భారత-ఎ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ వ్యవహరించనున్నాడు. అతడితో పాటు ఈ జట్టులో ఐపీఎల్ స్టార్లు ప్రియాన్ష్ ఆర్య, ఆయూష్ బదోని, ప్రభుసిమ్రాన్ సింగ్, సిమర్జీత్ సింగ్, విప్రజ్ నిగమ్‌లకు చోటు దక్కింది.
కెప్టెన్‌గా తిలక్ వర్మ..
ఇక ఆఖరి రెండు మ్యాచ్‌లకు భారత-ఎ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ తిలక్ వర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. తిలక్‌తో పాటు ఆసియాకప్ భారత జట్టులో భాగమైన అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లకు కూడా ఈ అనాధికరిక వన్డే సిరీస్‌లో ఆడనున్నారు. ఆసియాకప్ ముగిశాక వీరి నలుగురు నేరుగా ఇండియా-ఎ జట్టుతో కలవనున్నారు.
తొలి వన్డే జట్టులో భాగంగా ఉన్న ప్రియాన్ష్ ఆర్య, సిమర్జీత్ సింగ్‌లకు ఆఖరి రెండు వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఇండియా-ఎ వర్సెస్ ఆసీస్-ఎ మధ్య మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 30 నుంచి ఆక్టోబర్ 5 మధ్య జరగనుంది. మొత్తం మూడు మ్యాచ్‌లు కాన్పూర్ వేదికగానే జరగనున్నాయి.
తొలి వన్డే కోసం భారత-ఎ జట్టు
రజత్ పాటిదార్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిషాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, సిమర్‌జీత్ సింగ్.
రెండు, మూడు వన్డేల కోసం భారత- జట్టు
తిలక్ వర్మ (కెప్టెన్), రజత్ పాటిదార్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిషాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా