Afridi Vs Kaneria: 'ఏమైనా ఉంటే మీరిద్దరు తేల్చుకోండి.. మా దేశాన్ని ఎందుకు లాగుతారు?'

India Fans Slams Shahid Afridi Words Kaneria Interview With Enemy Country - Sakshi

పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ దానిష్‌ కనేరియా షాహిద్‌ అఫ్రిదిపై గత వారం నుంచి వరుస ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. అఫ్రిది ఒక క్యారెక్టర్‌లెస్.. అబద్దాల కోరు.. జట్టు నుంచి బహిష్కరించడానికి ప్రధాన కారణం అఫ్రిదియేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక గురువారం తనను ఇస్లాం మతంలోకి మారాలంటూ అఫ్రిది ఒత్తిడి చేశాడంటూ.. హిందువులకు ఇక్కడ చోటు లేదంటూ అవమానపరిచాడంటూ పేర్కొన్నాడు. అయితే కనేరియా వరుస ఆరోపణలపై షాహిద్‌ అఫ్రిది ఎట్టకేలకు స్పందించాడు. కనేరియా కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నాడని.. శత్రు దేశానికి(భారతదేశం) చెందిన మీడియా చానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చి తనను అవమానపరచాడంటూ పేర్కొన్నాడు.

''కనేరియా ఆరోపించినట్టు తాను అంత చెడ్డవాడినే అయితే  అప్పుడే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించాడు. కేవలం తన పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నాడు. కనేరియా నాకు సోదరుడు లాంటివాడు. కొన్నేళ్లపాటు ఇద్దరం కలిసి పాకిస్తాన్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాము. అది మరిచిపోయి పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. నన్ను అబద్దాల కోరు.. క్యారెక్టర్ లేనివాడు అనే ముందు అతడి క్యారెక్టర్ ఏంటో చూసుకుంటే బాగుంటుంది. అతడు మన శత్రు దేశం మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి మత చిచ్చు రగిలిస్తున్నాడు. ఇది అంత మంచి పరిణామం కాదు.'' అని ఆగ్రహం వక్తం చేశాడు.  

అయితే అఫ్రిది ఆరోపణలపై టీమిండియా క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఘాటుగా స్పందించారు. ''కనేరియా నీపై ఆరోపణలు చేశాడు నిజమే.. ఏమైనా ఉంటే మీరిద్దరు తేల్చుకోండి.. మధ్యలో మా దేశాన్ని ఎందుకు లాగుతున్నారు''.. ''ఒక ఆటగాడు ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఆయా మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చే హక్కు ఉంటుంది. ఆ క్రమంలో మా దేశానికి చెందిన ప్రముఖ చానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చి ఉండొచ్చు''.. ''అసలు మత చిచ్చు రగిలిస్తుంది నువ్వు(అఫ్రిది).. శత్రుదేశం అని సంభోదించినప్పుడే నీ క్యారెక్టర్‌ ఏంటో అర్థమైంది'' అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: షాహిద్‌ అఫ్రిది ఒక క్యారెక్టర్‌ లెస్‌.. అబద్ధాల కోరు : పాక్‌ మాజీ స్పిన్నర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top