Ind Vs WI T20I Series: భారత్‌తో టీ20 సిరీస్‌.. వెస్టిండీస్‌ జట్టు ప్రకటన... బంగ్లాను ఓడించిన అదే టీమ్‌తో!

Ind Vs WI: West Indies Announces 16 Member Squad For T20I Series - Sakshi

India Vs West Indies 2022 T20 Series: టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లతో వరుస టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్‌ సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్‌, కివీస్‌లతో పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌లకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ మేరకు క్రికెట్‌ వెస్టిండీస్‌.. జట్టు వివరాలకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. 

పరిమిత ఓవర్ల కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ జట్టును ముందుండి నడిపించనుండగా.. రోవ్‌మన్‌ పావెల్‌ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. కాగా పూరన్‌ బృందం ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌, టీమిండియాతో వన్డే సిరీస్‌లో ఘోర పరాభవం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. 

అదే జట్టుతో!
అయితే, బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో మాత్రం విండీస్‌ అదరగొట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. హెట్‌మెయిర్‌, హోల్డర్‌ మినహా బంగ్లాతో తలపడిన అదే జట్టుతో టీమిండియాతో పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌కు సిద్ధమైంది. సొంతగడ్డ మీద వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌తో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది.

కాగా విండీస్‌ రోహిత్‌ సేనతో శుక్రవారం(జూలై 29) తొలి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ముగిసిన వెంటనే న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధం కానుంది. ఆగష్టు 10 నుంచి 14 వరకు కివీస్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇక నికోలస్‌ పూరన్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విండీస్‌ బిజీబిజీగా గడుపుతోంది.

బిజీబిజీగా వెస్టిండీస్‌!
నెదర్లాండ్స్‌ పర్యటనతో సారథిగా అతడి ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు టూర్‌కు వెళ్లిన వెస్టిండీస్‌.. తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడింది. ఆ తర్వాత టీమిండియాతో వన్డే సిరీస్‌ ముగించుకుని.. టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. అనంతరం న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. 

టీమిండియా, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడబోయే వెస్టిండీస్‌ జట్టు ఇదే:
నికోలస్‌ పూరన్‌(కెప్టెన్‌), రోవ్‌మన్‌ పావెల్‌(వైస్‌ కెప్టెన్‌), బ్రూక్స్‌, డొమినిక్‌ డ్రేక్స్‌, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, జేసన్‌ హోల్డర్‌, అకీల్‌ హొసేన్‌, అల్జారీ జోసెఫ్‌, బ్రాండన్‌ కింగ్‌, కైలీ మేయర్స్‌, ఒబెడ్‌ మెకాయ్‌, కీమో పాల్‌, రొమారియో షెఫర్డ్‌, ఒడియన్‌ స్మిత్‌, డెవాన్‌ థామస్‌, హైడెన్‌ వాల్ష్‌ జూనియర్‌.

టీమిండియాతో విండీస్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ షెడ్యూల్‌
►మొదటి టీ20- జూలై 29- బ్రియన్‌ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్‌
►రెండో టీ20- ఆగష్టు 1- వార్నర్‌ పార్క్‌, సెయింట్‌ కిట్స్‌
►మూడో టీ20- ఆగష్టు 2-వార్నర్‌ పార్క్‌, సెయింట్‌ కిట్స్‌
►నాలుగో టీ20- ఆగష్టు 6- సెంట్రల్‌ బ్రొవార్డ్‌ రీజనల్‌ పార్క్‌ స్టేడియం టర్ఫ్‌ గ్రౌండ్‌, ఫ్లోరిడా
►ఐదో టీ20- ఆగష్టు 7- సెంట్రల్‌ బ్రొవార్డ్‌ రీజనల్‌ పార్క్‌ స్టేడియం టర్ఫ్‌ గ్రౌండ్‌, ఫ్లోరిడా
►మ్యాచ్‌ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం

న్యూజిలాండ్‌తో వెస్టిండీస్‌ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ షెడ్యూల్‌(West Indies Vs New Zealand T20 Series)
►మొదటి టీ20- ఆగష్టు 10- సబీనా పార్క్‌, జమైకా
►రెండో టీ20- ఆగష్టు 12- సబీనా పార్క్‌, జమైకా
►మూడో టీ20- ఆగష్టు 14- సబీనా పార్క్‌, జమైకా
చదవండి: Gustav McKeon T20I Records: 18 ఏళ్ల వయసులో అదిరిపోయే రికార్డులు.. ఎవరీ క్రికెటర్‌?
Shubman Gill: అప్పుడేమో ద్విశతకం! 91, 96, 98 నాటౌట్‌.. పాపం సెంచరీ గండం గట్టెక్కలేడా?!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top