IND VS WI 1st ODI: కెప్టెన్లను మార్చడంలో ప్రపంచ రికార్డును సమం చేసిన భారత్‌

IND VS WI 1st ODI: India Equal Sri Lanka World Record For Having Most Captains In A Calendar Year - Sakshi

విజయాలు, పరాజయాలు, వ్యక్తిగత రికార్డులు పక్కన పెడితే మరో విషయంలోనూ భారత క్రికెట్‌ జట్టు ప్రపంచ రికార్డులను బద్దలుకొడుతుంది. నిన్న (జులై 22) విండీస్‌తో జరిగిన తొలి వన్డేతో ఓ ఏడాదిలో అత్యధిక మంది కెప్టెన్లను మార్చిన జట్టుగా టీమిండియా రికార్డుల్లోకెక్కింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ మంది కెప్టెన్లను మార్చిన దేశంగా శ్రీలంక పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. 2017లో శ్రీలంక ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చగా.. తాజాగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా ఆ రికార్డును సమం చేసింది. 

విండీస్‌తో వన్డేకు శిఖర్‌ ధవన్‌ కెప్టెన్‌గా వ్యవహరించడంతో ఈ ఏడాది భారత జట్టు కెప్టెన్ల సంఖ్య ఏడుకు చేరింది. 1959లో కూడా భారత జట్టుకు ఇంచుమించు ఇలాగే కెప్టెన్లను మార్చింది. ఆ ఏడాది వినూ మన్కడ్, హేమూ అధికారి, దత్తా గైక్వాడ్, పంకజ్ రాయ్, గులాబ్ రాయ్ రాంచన్ లు టీమిండియా సారధులుగా వ్యవహరించారు.

ఈ ఏడాది టీమిండియా కెప్టెన్లు వీరే..
విరాట్ కోహ్లి (సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌)
కేఎల్ రాహుల్ (సౌతాఫ్రికాతో వన్డేలు)
రోహిత్ శర్మ (సౌతాఫ్రికా, వెస్టిండీస్ సిరీస్‌లు)
రిషభ్ పంత్ (సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌)
హార్ధిక్ పాండ్యా (ఐర్లాండ్‌లో టీ20 సిరీస్‌)
జస్ప్రీత్ బుమ్రా (ఇంగ్లండ్ తో రీషెడ్యూల్ 5వ టెస్ట్)
శిఖర్ ధవన్ (వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌)

ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక మంది కెప్టెన్లను మార్చిన జట్లు..
భారత్‌ - 2022 - ఏడుగురు కెప్టెన్లు
శ్రీలంక - 2017 - ఏడుగురు కెప్టెన్లు
జింబాబ్వే - 2001 - ఆరుగురు కెప్టెన్లు
ఇంగ్లండ్ - 2011 - ఆరుగురు కెప్టెన్లు
ఆస్ట్రేలియా - 2021 - ఆరుగురు కెప్టెన్లు
చదవండి: రాహుల్‌ రికార్డును బ్రేక్‌ చేసిన శ్రేయస్‌ అయ్యర్
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top