
ఆసియా కప్ 2025 గెలుపు జోష్‌లో ఉన్న టీమిండియాకు ఓ చేదు వార్త అందింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) త్వరలో ఆస్ట్రేలియాతో (India vs Australia) జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరం కానున్నాడని తెలుస్తుంది. హార్దిక్ ఆసియా కప్ ఫైనల్‌కు ముందు గాయపడ్డాడు.
దీంతో అతను పాక్‌తో జరిగిన ఫైనల్లోనూ ఆడలేదు. హార్దిక్‌కు ఎడమ తొడ భాగంలో గాయమైనట్లు సమాచారం. వైద్యులు అతనికి నాలుగు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది.
డాక్టర్లు చెప్పినట్లు హార్దిక్ నాలుగు వారాల్లో కోలుకుంటే ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. టీమిండియా 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత వన్డేలు జరుగనున్నాయి. ఆతర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. హార్దిక్ వన్డేలకు మిస్ అయినా టీ20 సిరీస్‌కు అందుబాటులోకి రావచ్చు.
కాగా, సెప్టెంబర్ 28న జరిగిన ఫైనల్లో టీమిండియా పాక్‌పై విజయం సాధించి, తొమ్మిదోసారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే.
ఈ టోర్నీ తర్వాత కేవలం మూడో రోజుల గ్యాప్‌లో టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అక్టోబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. అనంతరం అక్టోబర్ 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో రెండో టెస్ట్ జరుగుతుంది.
ఈ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. జియో హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
విండీస్ సిరీస్‌కు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్‌కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్
వెస్టిండీస్: రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, తేజ్‌నరైన్ చంద్రపాల్, జాన్ క్యాంప్‌బెల్, జోహన్ లేన్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, జెడియా బ్లేడ్స్, జేడన్ సీల్స్, ఖారీ పియెర్
చదవండి: కొనసాగుతున్న ఆసియా కప్ హైడ్రామా.. ట్రోఫీ తిరిగి ఇచ్చేందుకు షరతులు పెట్టిన నఖ్వీ