ఐపీఎల్‌ 2026 చెత్త జట్టు.. కెప్టెన్‌గా హార్దిక్‌.. స్కై కూడా చోటు | Hardik Pandya To Captain, Suryakumar Yadav In: Flop XI Of IPL 2026 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2026 చెత్త జట్టు.. కెప్టెన్‌గా హార్దిక్‌.. స్కై కూడా చోటు

Jun 1 2026 12:32 PM | Updated on Jun 1 2026 7:48 PM

Hardik Pandya To Captain, Suryakumar Yadav In: Flop XI Of IPL 2026

ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ఈ సీజన్‌లో నిరాశపరిచిన ఆటగాళ్లతో ఒక "ఫ్లాప్‌ జట్టు" రూపొందించబడింది. క్రెక్స్‌ అనే ప్రముఖ ఇంగ్లీష్‌ వెబ్‌సైట్‌ రూపొందించిన ఈ జట్టులో అనూహ్యంగా పెద్ద పెద్ద స్టార్లు చోటు దక్కించుకున్నారు. కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌ను లీడ్‌ చేసిన హార్దిక్‌ పాండ్యా ఎంపిక కాగా.. ఆశ్చర్యకరంగా పంజాబ్‌ కింగ్స్‌ విధ్వంసకర ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య పేరు ఈ జట్టులో ప్రత్యక్షమైంది.

ప్రియాంశ్‌ మినహా మిగతా ప్లేయర్ల పేర్లు ఊహించినవే అయినా, ఒకరిద్దరి పేర్లు తొలగించి ఉండాల్సిందన్న భావన కలిగింది. అలాంటి వారిలో సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ పేరు ఒకటి. రుతు ఈ సీజన్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయినా, 337 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

ప్రియాంశ్‌ ఆర్య సైతం ఈ సీజన్‌లో 364 పరుగులు సాధించినా, నిలకడలేమి అతన్ని ఈ జట్టులో చేర్చింది. టాపార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ పేరు ఊహించిందే.

మిడిలార్డర్‌లో ఈ సీజన్‌ వైఫల్యాధికుల పేర్లు ఉన్నాయి. లక్నో తరఫున ఘోర ప్రదర్శన చేసిన పూరన్‌, వైఫల్యాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారిన అదే జట్టు కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌, డ్రాప్‌ క్యాచ్‌లతో ఈ సీజన్‌లో హైలైట్‌ అయిన పంజాబ్‌ ఆల్‌రౌండర్‌ శశాంక్‌ సింగ్‌, అదే జట్టు మరో ఆల్‌రౌండర్‌ మార్కో జన్సెన్‌ ఫ్లాప్‌ జట్టు మిడిలార్డర్‌లో చోటు దక్కించుకున్నారు.

కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా దారుణంగా విఫలమైన హార్దిక్‌ పాండ్యా ఈ ఫ్లాప్‌ జట్టుకు ఫస్ట్‌ ఛాయిస్‌ కెప్టెన్‌ అయ్యాడు.

బౌలింగ్‌ విభాగానికొస్తే.. ఈ విభాగం కూడా స్టార్లతో నిండింది. మరిముఖ్యంగా టీమిండియా స్టార్లంతా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆల్‌రౌండ్‌గా మిక్స్‌డ్ సీజన్ కలిగిన అక్షర్‌ పటేల్‌.. వికెట్లు లేకా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్న కుల్దీప్‌ యాదవ్‌.. వికెట్ల కోసం​ కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూసిన బుమ్రా, వికెట్లు తీయగలిగినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అర్షదీప్‌ సింగ్‌ ఈ ఫ్లాప్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు.

మొత్తంగా హార్దిక్, సూర్యకుమార్, బుమ్రా, పంత్ వంటి పెద్ద పేర్లు ఈ జట్టులో ఉండటం చర్చనీయాంశంగా మారింది. 

ఇదిలా ఉంటే, నిన్న (మే 31) జరిగిన ఐపీఎల్‌ 2026 ఫైనల్లో ఆర్సీబీ గుజరాత్‌ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్‌లో ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. క్రెక్స్‌ ప్రకటించిన ఫ్లాప్‌ జట్టులో ఛాంపియన్‌, రన్నరప్‌ ఆర్సీబీ, గుజరాత్‌ జట్లలో నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement