
భారత క్రికెట్‌కు దూకుడు పరిచయం చేసిన ధీరుడు అతడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో జట్టు బాధ్యతలను భుజాలపై వేసుకున్న వారియర్ అతడు. తన కెప్టెన్సీతో ఇంటా, బయట భారత జట్టును విజయపథంలో నడిపించిన నాయకుడు అతడు.
యువరాజ్ సింగ్, హార్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ వంటి స్టార్ క్రికెటర్లను పరిచయం చేసిన దాదా అతడు. అతడే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly). అభిమానులు ముద్దుగా పిలుచుకునే బెంగాల్ టైగర్ పుట్టిన రోజు నేడు(జూలై 8). ఈ సందర్భంగా గంగూలీ పేరిట ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్న పది ఐకానిక్ రికార్డులపై ఓ లుక్కేద్దాం.

ఒకే ఒక్కడు..
అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో వరుసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పొందిన ఏకైక క్రికెటర్ గంగూలీ. ఇప్పటికి అతడి రికార్డును ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. 1997లో పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో దాదా ఈ ఘనత సాధించాడు.

ఏకైక లెఫ్ట్ హ్యాండర్‌గా..
వన్డేల్లో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతి వాటం బ్యాటర్‌గా గంగూలీ కొనసాగుతున్నాడు. గంగూలీ తన కెరీర్‌లో 308 మ్యాచ్‌లు ఆడి 11221 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా గంగూలీ ఉన్నాడు. అగ్రస్ధానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(18426) ఉండగా.. రెండో స్దానంలో విరాట్ కోహ్లి(14181) కొనసాగుతున్నాడు.
👉ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడు కూడా గంగూలీనే కావడం గమనార్హం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్లో న్యూజిలాండ్‌పై సౌరవ్ సెంచరీ(117) సెంచరీతో మెరిశాడు.
👉ఐసీసీ వన్డే టోర్నీల నాకౌట్ మ్యాచ్‌ల్లో మూడు శతకాలు చేసిన ఆటగాళ్లలో గంగూలీ ఒకడు. ఆయనతోపాటు ఈ లిస్ట్ లో రికీ పాంటింగ్, సయద్ అన్వర్ లు ఉన్నారు. ఈ జాబితాలో భారత తరపున నుంచి గంగూలీ ఒక్కడే ఉన్నాడు.
👉ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భారత తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా ఇప్పటికీ గంగూలీ కొనసాగుతున్నాడు. 1999 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై గంగూలీ 183 పరుగులు పరుగులు చేశాడు.

వరసుగా నాలుగు సార్లు
1997 నుంచి 2000 వరకు వరుసగా నాలుగు క్యాలెండర్ ఈయర్స్‌లో 1000 కన్నా ఎక్కువ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గంగూలీ.
1997లో – 1338 పరుగులు
1998లో – 1328 పరుగులు
1999లో – 1767 పరుగులు
2000లో – 1579 పరుగులు
👉వరల్డ్ క్రికెట్‌లో అంతర్జాతీయ వన్డేల్లో పదివేలకు పైగా పరుగులు, వంద వికెట్లు సాధించిన ఆరుగురిలో ఒకడిగా గంగూలీ ఉన్నారు. భారత్ నుంచి మాత్రం గంగూలీ ఒక్కడే ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
👉టెస్టు అరంగేట్రంలో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి, సెకెండ్ ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్ అయిన ఏకైక క్రికెటర్ కూడా దాదానే కావడం విశేషం.
👉ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గంగూలీ నిలిచాడు. గంగూలీ 1990లో ఈ ఫీట్ సాధించాడు.
👉 భారత జట్టుకు తొలి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌నుని అందించిన కెప్టెన్ కూడా గంగూలీనే. 2000లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గంగూలీ సారథ్యంలోని టీమిండియా సొంతం చేసుకుంది.