భారత ట్రాప్‌ షూటర్లకు నిరాశ  | Sakshi
Sakshi News home page

భారత ట్రాప్‌ షూటర్లకు నిరాశ 

Published Thu, Feb 8 2024 3:43 AM

Disappointment for Indian trap shooters - Sakshi

ప్రపంచకప్‌ షాట్‌గన్‌ షూటింగ్‌ టోర్నీలో తొలిరోజు భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. మొరాకోలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల, పురుషుల ట్రాప్‌ వ్యక్తిగత విభాగాల్లో భారత షూటర్లెవరూ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు.

మహిళల ట్రాప్‌ క్వాలిఫయింగ్‌లో రాజేశ్వరి 113 పాయింట్లతో 8వ ర్యాంక్‌లో నిలిచింది. టాప్‌–6లో నిలిచినవారు ఫైనల్‌ చేరుకుంటారు. భారత్‌కే చెందిన భవ్య 19వ ర్యాంక్‌లో, మనీషా 24వ ర్యాంక్‌లో నిలిచారు. పురుషుల ట్రాప్‌ క్వాలిఫయింగ్‌లో భౌనీష్‌ 17వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Advertisement
 
Advertisement