చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో విరాట్‌ కోహ్లి | DC vs RCB: Virat Kohli Near 9000 IPL Runs | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో విరాట్‌ కోహ్లి

Apr 27 2026 2:37 PM | Updated on Apr 27 2026 2:52 PM

DC vs RCB: Virat Kohli Near 9000 IPL Runs

ఐపీఎల్‌-2026లో సోమ‌వారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లిని ప‌లు అరుదైన రికార్డుల‌ను ఊరిస్తున్నాయి. ఢిల్లీతో మ్యాచ్‌లో కోహ్లి మరో 111 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.

కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు త‌న ఐపీఎల్ కెరీర్‌లో 274 మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 8,889 ప‌రుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌ల‌లో 8 సెంచ‌రీలు, 66 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో కోహ్లి 62 ప‌రుగులు సాధిస్తే, భార‌త గ‌డ్డ‌పై 10,000 టీ20 ర‌న్స్ న‌మోదు చేసిన ప్లేయ‌ర్‌గా అవత‌రిస్తాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయ‌ర్‌గా కోహ్లి రికార్డుల‌కెక్కుతాడు. అంతేకాకుండా తన టీ20 కెరీర్‌లో 450 సిక్సర్ల మార్కును చేరడానికి కోహ్లి కేవలం 3 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.

కోహ్లి ఉన్న ఫామ్‌కు ఈ రికార్డులను అందుకోవ‌డం పెద్ద విష‌యమేమి కాదు. ఈ ఏడాది సీజ‌న్‌లోనూ ఎప్ప‌టిలానే కోహ్లి ప‌రుగులు వ‌ర‌ద పారిస్తున్నాడు. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 44 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు త‌న సొంత‌మైదానం(అరుణ్ జైట్లీ స్టేడియం)లో స‌త్తాచాటేందుకు కింగ్ సిద్ద‌మ‌య్యాడు. కోహ్లి(328) ప్ర‌స్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్ధానంలో ఉన్నాడు.
చదవండి: IPL 2026: రిషబ్‌ పంత్‌ సంచలన నిర్ణయం..! సీజన్‌ మధ్యలోనే?

Advertisement
 
Advertisement
Advertisement