సంపాదనలో మెస్సీని దాటేశాడు.. ఏడాదికి 922 కోట్లు అర్జిస్తున్నాడు

Cristiano Ronaldo Overtakes Messi As World Highest Earning Footballer - Sakshi

న్యూజెర్సీ: 2021-22 సీజన్‌కు గాను ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డొ అత్యధికంగా ఏడాదికి 922 కోట్లు(125 మిలియన్‌ డాలర్లు) అర్జిస్తూ టాప్‌లో నిలిచాడు. ఇటీవలే జువెంటస్‌ క్లబ్‌ను వదిలి మాంచెస్టర్‌ యునైటెడ్‌కు బదిలీ అయిన సీఆర్‌7.. అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ(811 కోట్లు)ని రెండో స్థానానికి నెట్టి టాప్‌ ప్లేస్‌కు చేరుకున్నాడు. 

జీతభత్యాల ద్వారా 70 మిలియన్‌ డాలర్లు పొందే రొనాల్డొ.. కమర్షియల్‌ డీల్స్‌ రూపేనా మరో 55 మిలియన్‌ డాలర్లు జేబులో వేసుకుంటున్నాడు. మరోవైపు రొనాల్డొ సమవుజ్జీ అయిన మెస్సీ.. జీతం ద్వారా 75 మిలియన్‌ డాలర్లు, ఇతర ఎండార్స్‌మెంట్ల రూపేనా మరో 35 మిలియన్‌ డాలర్లు అర్జిస్తున్నాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాతి స్థానాల్లో బ్రెజిల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ నెయ్‌మార్‌(95 మిలియన్‌ డాలర్లు), టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌(90 మిలియన్‌ డాలర్లు), ప్రొఫెషనల్‌ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ లెబ్రాన్‌ జేమ్స్‌(65 మిలియన్‌ డాలర్లు), ప్రముఖ గోల్ఫ్‌ క్రీడాకారుడు టైగర్‌ వుడ్స్‌(70 మిలియన్‌ డాలర్లు) ఉన్నారు. 
చదవండి: ఇంగ్లండ్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం.. మరో దేశానికి వలస

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top