Chris Cairns: ఎమర్జెన్సీ సర్జరీ చేస్తుండగా  దిగ్గజ ఆల్‌రౌండర్‌కు పక్షవాతం

Chris Cairns Suffers Paralysis In Legs During Life Saving Surgery - Sakshi

సిడ్నీ: న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌, దిగ్గజ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌ పక్షవాతం బారినపడ్డాడు. అస్ట్రేలియాలో గుండెకు ఎమర్జెన్సీ సర్జరీ చేసేటప్పుడు వెన్నెముకలో స్ట్రోక్‌ రావడంతో రెండు కాళ్లు చచ్చుపడిపోయాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతనికి రీహాబిలిటేష‌న్ ప్ర‌క్రియ నిర్వ‌హించేందుకు ఆస్ట్రేలియాలోనే మ‌రో ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. కెయిన్స్‌.. గత కొంతకాలంగా ఆరోటిక్ డిసెక్ష‌న్‌ అనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. 

కాగా, 51 ఏళ్ల క్రిస్‌ కెయిన్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్‌లో కెయిన్స్‌ కివీస్‌ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. కెయిన్స్‌ తన జమానాలో మేటి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 
చదవండి: అఫ్గాన్‌లను చంపడం ఆపండి ప్లీజ్‌.. రషీద్‌ ఖాన్‌ ఉద్వేగం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top