ఆ అవకాశం మనం ఇవ్వకూడదు: సానియా మీర్జా | 'Chin Up Princess Or Your Crown Slips': Sania Mirza Strong Message For Girls - Sakshi
Sakshi News home page

Sania Mirza: ఆ అవకాశం మనం ఇవ్వకూడదు: అందమైన ఫొటోలతో సానియా సందేశం

Published Tue, Feb 6 2024 11:35 AM

Chin Up Princess Or Your Crown Slips Sania Mirza Strong Message For Girls - Sakshi

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా సోషల్‌ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటారు. తన ఫొటోషూట్లకు సంబంధించిన ఫొటోలతో పాటు.. కుమారుడు ఇజహాన్‌తో ఉన్న ఫొటోలను ఇటీవల ఎక్కువగా షేర్‌ చేస్తున్నారు.

ముఖ్యంగా భర్త షోయబ్‌ మాలిక్‌ నుంచి విడిపోయిన తర్వాత.. అతడి పేరును ప్రస్తావించకుండానే తాను రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న తీరును వివరించే క్యాప్షన్లతో కొటేషన్లు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా.. సానియా షేర్‌ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

‘‘మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు సోకాల్డ్‌ కఠిన పరిస్థితులకు మనం అవకాశం ఇవ్వకూడదు’’ అన్న అర్థంలో సానియా మీర్జా తన అందమైన ఫొటోలకు ఇలా మరింత అందమైన క్యాప్షన్‌ ఇచ్చారు. ఇందులో ఆమె మల్టీకలర్‌ మ్యాచింగ్‌సెట్‌ ధరించి.. సింపుల్‌ మేకప్‌.. స్లీక్‌ హెయిర్‌తో తన సౌందర్యాన్ని మరింత ద్విగుణీకృతం చేసేలా కనిపించారు.

ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘మీరు చెప్పింది నిజం. ప్రతి ఒక్కరు ముందుగా తమను తాము ప్రేమించుకోవడం.. తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం అలవాటు చేసుకోవాలి. మన తర్వాతే మనకు ఎవరైనా..! అన్న సందేశాన్ని ఎంత చక్కగా చెప్పారో’’ అంటూ సానియాను ప్రశంసిస్తున్నారు.

కాగా పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను ప్రేమించి.. 2010లో పెళ్లాడారు సానియా మీర్జా. వీరికి 2018లో కుమారుడు ఇజహాన్‌కు జన్నించాడు. ఇక దుబాయ్‌లో కాపురం పెట్టిన ఈ క్రీడాకారుల జంట మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో సానియా తన భర్తకు విడాకులిచ్చారు.

షోయబ్‌ మాలిక్‌ వివాహేతర సంబంధాల వల్లే సానియా మీర్జా ఈ నిర్ణయం తీసుకున్నారని పాకిస్తాన్‌ మీడియా వెల్లడించడం విశేషం. అయితే, షోయబ్‌ తన మూడో పెళ్లి(నటి సనా జావెద్‌)కి సంబంధించిన ఫొటోలు విడుదల చేసిన తర్వాతే.. వీరి విడాకుల వ్యవహారం బయటపడటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. షోయబ్‌ మాలిక్‌ ప్రవర్తన అతడి కుమారుడు ఇజహాన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోందంటూ పాక్‌ జర్నలిస్టు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. సామా టీవీకి చెందిన నయీమ్‌ హనీఫ్‌ మాట్లాడుతూ.. షోయబ్‌ వల్ల స్కూళ్లో ఇజహాన్‌ అవమానాలకు గురికావాల్సి వస్తోందని పేర్కొన్నారు. అయితే, సానియా మాత్రం ఈ పరిణామాలపై ఇప్పటికీ నేరుగా స్పందించలేదు.

Advertisement
 
Advertisement