
లార్డ్స్ టెస్ట్‌లో (మూడవది) భారత్ ఇంగ్లండ్ చేతిలో 22 పరుగుల స్వల్ప తేడాతో పోరాడి ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 193 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక బోల్తా పడింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. టెయిలెండర్ల సహకారంతో వీరోచితంగా పోరాడినా టీమిండియాను గట్టెక్కించలేకపోయాడు. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా ఎంత పోరాడి ఓడినా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2013 నుంచి టీమిండియా 26 టెస్ట్‌ల్లో 150 ప్లస్ పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ కేవలం 2 సార్లు మాత్రమే విజయవంతమైంది. 17 మ్యాచ్‌ల్లో పరాజయంపాలవగా.. 7 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. భారత్ గెలిచిన రెండు సందర్భాల్లో ఒకటి 2021లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాపై కాగా.. రెండోది 2024లో రాంచీలో ఇంగ్లండ్‌పై.
ఛేజింగ్ కష్టాలు.. సచిన్ రిటైర్మెంట్ నుంచి ఇంతే..!
భారత్‌కు ఛేజింగ్ కష్టాలు కొత్తేమీ కానప్పటికీ.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ నుంచి పరిస్థితి మరింత దిగజారింది. 2013 నవంబర్‌లో సచిన్ టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పగా.. అదే ఏడాది డిసెంబర్ నుంచి భారత్ 26 టెస్ట్‌ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే 150 ప్లస్ లక్ష్యాలను ఛేదించింది.
గడిచిన 12 ఏళ్లలో టీమిండియా ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా చలామణి అయినప్పటికీ ఛేజింగ్ కష్టాలు ఎదుర్కొంది. స్వల్ప లక్ష్య ఛేదనల్లో పాకిస్తాన్, వెస్టిండీస్ లాంటి జట్లు కూడా భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయి. ఈ జాబితాలో టీమిండియా ఎనిమిదో స్థానంలో ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది.
గడిచిన 12 ఏళ్లలో భారత్ 250 పరుగులలోపు లక్ష్యాలను ఛేదిస్తూ ఓడిన సందర్భాలు..
2018 బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌పై 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 162 పరుగులకే ఆలౌట్
2018 సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌పై 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 184 పరుగులకే ఆలౌట్.
2015 గాలెలో శ్రీలంకపై 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 112 పరుగులకే ఆలౌట్.
2018 కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 135 పరుగులకే ఆలౌట్.
2024 హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌పై 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 202 పరుగులకే ఆలౌట్.