
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఈ ఏడాది నవంబర్‌లో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టులో సఫారీలు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. టెస్టు సిరీస్‌తో ప్రోటీస్ భారత పర్యటన ప్రారంభం కానుంది. నవంబర్ 14 నుంచి 18 వరకు ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది.
అయితే ఈ మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను బెంగాల్ క్రికెట్ అసోయేషిన్ సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ప్రకారం..టిక్కెట్ల కనీసం ధర రోజుకు 60 రూపాయలుగా నిర్ణయించారు. మొత్తం ఐదు రోజులకు టిక్కెట్ కావాలనుకుంటే 300 రూపాయలు చెల్లాంచాల్సి ఉంటుంది.
గరిష్ఠంగా రోజు 250 రూపాయల వరకు (మొత్తం అయిదు రోజులకు రూ.1,250) ఉంటాయని క్యాబ్ అధికారులు పేర్కొన్నారు. ఈ మ్యాచ్ టిక్కెట్లను డిస్ట్రిక్ట్ యాప్, అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫిజికల్ టిక్కెట్లు అవసరం లేదు. నేరుగా అన్‌లైన్ టిక్కెట్ ఉంటే చాలు స్టేడియంలోకి అనుమతి ఇస్తారు.
కాగా 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టు తర్వాత ఈడెన్ గార్డెన్స్‌లో టెస్టు మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఈ సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025/27) సైకిల్‌లో భాగంగా జరగనుంది.
చదవండి: పాకిస్తాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజం..!?