ఐపీఎల్‌లో బుకీ... సమాచారమిచ్చిన క్రికెటర్‌ | Bookie Has Approached Cricketer Playing In IPL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో బుకీ... సమాచారమిచ్చిన క్రికెటర్‌

Oct 4 2020 6:32 AM | Updated on Oct 4 2020 6:32 AM

Bookie Has Approached Cricketer Playing In IPL - Sakshi

దుబాయ్‌: ‘బయో బబుల్‌’లో ఐపీఎల్‌ జరుగుతున్నా బుకీలు మాత్రం ఫిక్సింగ్‌ ప్రయత్నాలు ఆపడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న ఒక క్రికెటర్‌ను ఫిక్సింగ్‌ కోసం బుకీ సంప్రదించినట్లు తెలిసింది. అయితే సదరు ఆటగాడు వెంటనే ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ)కు సమాచారం అందించాడు.

కఠిన ఆంక్షల కారణంగా ఆటగాళ్లను నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతో ఆన్‌లైన్‌ ద్వారా ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఏసీయూ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ దీనిని నిర్ధారించారు. ‘ఒక ప్లేయర్‌తో బుకీ మాట్లాడాడు. అతడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకు కొంత సమయం పడుతుంది. అవినీతి నిరోధక నిబంధనల ప్రకారం ఆటగాడు పేరు బయటకు చెప్పరాదు’ అని ఆయన వెల్లడించారు. (ఫామ్‌లో లేని అతడినే ఆడిస్తామంటే కుదరదు) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement