Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఫీట్ సాధించాడు. 16 మ్యాచ్‌లాడిన భువనేశ్వర్ 28 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా భువనేశ్వర్ షమీతో కలిసి రికార్డులకెక్కాడు.
కాగా ఈ జాబితాలో ఆర్సీబీ తరఫున హర్షల్‌పటేల్ (32 వికెట్లు, 2021 సీజన్), గుజరాత్ టైటాన్స్ తరఫున మహ్మద్ షమీ (28 వికెట్లు, 2023 సీజన్) ఈ ఫీట్ సాధించారు. ఇక ముంబై ఇండియన్స్ తరఫున జస్‌ప్రీత్ బుమ్రా (27 వికెట్లు, 2020 సీజన్), రాజస్తాన్ తరఫున చాహల్ (27 వికెట్లు, 2022), గుజరాత్ తరఫున మోహిత్ శర్మ (27 వికెట్లు, 2022) భువనేశ్వర్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ఇక ఈ సీజన్‌లో ఇప్పటికే పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న భువనేశ్వర్ మరో ఫీట్ కూడా అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో తొలి పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ (17 వికెట్లు) షమీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబాడ (19 వికెట్లు) తీసి తొలి స్థానంలో ఉన్నాడు.
Bhuvneshwar Kumar in IPL
2026 - 𝟮𝟴 wickets (7.95 Eco)*
2025 - 17 wickets (9.28 Eco)
2024 - 11 wickets (9.35 Eco)
2023 - 16 wickets (8.33 Eco)
2022 - 12 wickets (7.34 Eco)
2021 - 6 wickets (7.97 Eco)
2020 - 3 wickets (6.98 Eco)
2019 - 13 wickets (7.81 Eco)
2018 - 9 wickets… pic.twitter.com/DLOczlJ22e— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) May 31, 2026
చదవండి: 'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!'


