పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజంకు కోపమొచ్చింది. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లితో పోలుస్తూ అడిగిన ప్రశ్న అతడికి ఆగ్రహం తెప్పించింది. కాగా ఒకప్పుడు పాకిస్తాన్ ముఖచిత్రంగా పేరొందిన బాబర్‌కు ఇప్పుడు జాతీయ జట్టులో చోటే కరువయ్యే దుస్థితి.
మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా ఒకప్పుడు మంచి ఫామ్‌లో ఉన్న బాబర్ ఆజం (Babar Azam).. గత మూడేళ్లుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో పాక్ సెమీస్ చేరకుండానే నిష్క్రమించడంతో వన్డే, టీ20లతో పాటు టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా అతడు తప్పుకొన్నాడు.
ఫామ్‌లేమి
జట్టులో ఆటగాడిగా కొనసాగుతున్నా ఫామ్‌లేమితో విమర్శల పాలయ్యాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలోనూ చెత్త ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా పాక్ సెలక్టర్లు యాభై ఓవర్ల ఫార్మాట్ నుంచీ పక్కనపెట్టారు. దీంతో బాబర్ ఆజం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
ఒకప్పుడు కోహ్లితో బాబర్‌ను పోల్చిన పాక్ మాజీ క్రికెటర్లు సైతం ఇప్పుడు అతడి ప్రదర్శనపై పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో పెషావర్ జల్మీ జట్టు కెప్టెన్‌గా బాబర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. హైదరాబాద్ కింగ్స్‌మన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో బాబర్ 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు.
15వ ఓవర్లో హసన్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో పెషావర్ నాలుగు వికెట్ల తేడాతో గెలవడంతో బాబర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడిన సమయంలో అతడికి ఊహించని ప్రశ్న ఎదురైంది.
అతడితో మిమ్మల్ని పోలుస్తారు కదా!
‘‘విరాట్ కోహ్లి మాదిరే మీకు కూడా మంచి పేరు ఉంది. అయితే, అతడు మ్యాచ్‌లను గొప్పగా ఫినిష్ చేస్తాడు. మీరు మాత్రం ఆ విషయంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారు. చాలా మంది అతడితో మిమ్మల్ని పోలుస్తారు కదా!.. మరి ఈ పోలికపై మీ అభిప్రాయం ఏమిటి?’’ అని ఓ విలేఖరి ప్రశ్నించారు.
మండిపడ్డ బాబర్
ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇలాంటి విషయాల్లో నీ అభిప్రాయాలను నీతోనే పెట్టుకో. ఈ పోలికలు ఆపేసి అంతా ముందుకు సాగండి. నేను మ్యాచ్‌లు ఫినిష్ చేయలేననుకోవడం నీ తప్పు. అది నీ అభిప్రాయం మాత్రమే’’ అని బాబర్ ఆజం ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చదవండి: ‘సింగిల్’తో ఢిల్లీ డీలా
🚨 BABAR RESPONDED TO A QUESTION ON KOHLI-BABAR COMPARISON 🚨
• Journalist - "Virat Kohli comes with the same shot of game as you but he finishes the match which you lack. People compare him with you what are your views on the comparison?"
• Babar Azam - "Let these things to… pic.twitter.com/A69fIV9urI— Abdullah. (@Abdullahh_56) April 8, 2026


