
Asia Cup 2025 Ind vs Uae live Updates and Highlights:
భారత్ ఘన విజయం..
ఆసియాకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా యూఏఈ జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) టాప్ స్కోరర్ కాగా.. శుబ్‌మన్ గిల్(20), సూర్యకకుమార్ యాదవ్(7) ఆజేయంగా నిలిచారు
యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ ఒక్కడే వికెట్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, శివమ్ దూబే మూడు వికెట్లు పడగొట్టగారు. వీరితో పాటు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు.
దూకుడుగా ఆడుతున్న గిల్,అభిషేక్
58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. రెండు ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(13), అభిషేక్ శర్మ(11) ఉన్నారు.

57 పరుగులకే యూఏఈ ఆలౌట్..
దుబాయ్ వేదికగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు.
అతడితో పాటు శివమ్ దూబే మూడు, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా వికెట్ సాధించాడు. యూఏఈ బ్యాటర్లలో అలీషన్ షరాఫు(22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
ఆలౌట్ దిశగా యూఏఈ..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ ఆలౌట్ దిశగా సాగుతోంది. 57 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆతిథ్య యూఏఈ పీకల్లోతు కష్టాల్లో పడింది.

కుల్దీప్ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్‌లో 3 వికెట్లు
కుల్దీప్ యాదవ్ స్పిన్ మయాజాలానికి యూఏఈ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయింది. 9వ ఓవర్‌లో తొలి బంతికి రాహుల్ చోప్రా ఔట్ కాగా.. నాలుగో బంతికి కెప్టెన్ మహ్మద్ వసీం(19),.. ఆఖరి బంతికి హర్షిత్ కౌశిక్(2) పెవిలియన్‌కు చేరారు. 9 ఓవర్లకు యూఏఈ స్కోర్: 50/5
7 ఓవర్లకు యూఏఈ స్కోర్: 45/2
7 ఓవర్లు ముగిసే సరికి యూఏఈ రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ వసీం(18), రాహుల్ చోప్రా(2) ఉన్నారు.
యూఏఈ రెండో వికెట్ డౌన్..
29 పరుగుల వద్ద యూఏఈ రెండో వికెట్ కోల్పోయింది. రెండు పరుగులు చేసిన ముహమ్మద్ జోహైబ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు.
యూఏఈ తొలి వికెట్ డౌన్..
27 పరుగుల వద్ద యూఏఈ తొలి వికెట్ కోల్పోయింది. అలీషన్ షరాఫు(22)ను బుమ్రా అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. 4 ఓవర్లకు యూఏఈ స్కోర్: 27/0

రెండు ఓవర్లకు యూఏఈ స్కోర్: 16/0
రెండు ఓవర్లు ముగిసే సరికి యూఏఈ వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ వసీం(1),అలీషన్ షరాఫు(14) ఉన్నారు.
ఆసియాకప్-2025లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా యూఏఈతో తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పిచ్‌పై గ్రాస్ ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత కెప్టెన్ సూర్యకుమార్ కుమార్ యాదవ్ వెల్లడించాడు.
అదేవిధంగా ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో తీవ్రంగా శ్రమించినట్లు సూర్య చెప్పుకొచ్చాడు. కాగా భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. అయితే సంజూ మిడిలార్డర్ బ్యాటింగ్‌కు రానున్నాడు. ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా సైతం ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు.
తుది జట్లు
భారత్
అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ : ముహమ్మద్ వసీమ్(కెప్టెన్), అలీషాన్ షరాఫు, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా(వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, హైదర్ అలీ, ధ్రువ్ పరాశర్, ముహమ్మద్ రోహిద్ ఖాన్, జునైద్ సిద్ధిక్, సిమ్రంజీత్ సింగ్