
క్రీడ ఏదైనా భారత్, పాకిస్తాన్ సమరమంటే నెలల ముందుగానే టికెట్లు అమ్ముడుపోతుంటాయి. రేట్ ఎంతైనా కొనేందుకు అభిమానులు వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో టికెట్ల ధరలు లక్షల్లో ఉన్నా జనాలు తగ్గలేదు.
అయితే తాజా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. క్రికెట్ ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 14న దుబాయ్‌లో దాయాదుల పోరు జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటివరకు టికెట్లు అమ్ముడుపోలేదు.
ఇందుకు విపరీతంగా పెరిగిన రేట్లు ఓ కారణమని తెలుస్తుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండు ప్రీమియం సీట్ల ధర రూ. 2.5 లక్షలుగా (VIP Suites East) ఉంది.
- Royal Box: ₹2.30 లక్షలు
- Sky Box East: ₹1.67 లక్షలు
- Platinum, Lounge, Pavilion: ₹28,000-₹75,000
- సాధారణ టికెట్ ధర ₹10,000గా ఉన్నాయి.
ఇవి సాధారణంగా ఉండే రేట్ల కంటే చాలా ఎక్కువ. ఆర్దిక స్థితి బాగా ఉన్న అభిమానులు కూడా ఇంత రేట్లు పెట్టి టికెట్లు కొనడానికి వెనకడుగు వేస్తారు.
టికెట్లు అమ్ముడుపోకపోవడానికి ఇదో కారణమైతే, భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు మరో కారణంగా తెలుస్తుంది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి దాడి తర్వాత భారతీయులు ఏ విషయంలోనూ పాక్‌తో సంబంధాలు పెట్టుకోవాలని అనుకోవడం లేదు.
ఇరు దేశాలు క్రికెట్ మ్యాచ్‌ల్లో తలపడటం కూడా చాలా మందికి ఇష్టం లేదు. ఈ కారణంగానే భారత్-పాక్ ఆసియా కప్ సమరంపై ఆసక్తి తగ్గి ఉంటుంది.
పైగా ఆసియా కప్‌లో భారత్ తలపడబోయే పాక్ జట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా బలహీనంగా ఉంది. భారత అభిమానులు ఆసక్తి చూపకపోవడానికి ఇదీ ఓ కారణం కావచ్చు. ద్వితియ శ్రేణి జట్లపై గెలిచినా మజా ఉండదన్నది చాలా మంది భావన.