
ఆసియాకప్-2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన తమ రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను భారత్ చిత్తు చేసింది. పాక్ విధించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5ఓవర్లలో చేధించింది.
ఈ స్వల్ప లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), తిలక్ శర్మ(31) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47), శివమ్ దూబే(10) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగతా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
కుల్దీప్ మ్యాజిక్..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత బౌలర్ల దాటికి విలవిల్లాడింది. పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. స్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ సూపర్-4కు ఆర్హత సాధించింది. ఇక తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సెప్టెంబర్ 19న ఒమన్‌తో తలపడనుంది.
#PKMKBForever#INDvsPAK pic.twitter.com/wSdhqOsx8R
— Sarcastic Ujel (@Sarcasticujel) September 14, 2025