వెస్టిండీస్‌ టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడు రీ ఎంట్రీ | Sakshi
Sakshi News home page

WI vs ENG: వెస్టిండీస్‌ టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడు రీ ఎంట్రీ

Published Sun, Dec 10 2023 4:49 PM

Andre Russell Roped In As West Indies Name 15-Member T20I Squad To Face England - Sakshi

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును తమ జట్టును క్రికెట్‌ వెస్టిండీస్‌ ప్రకటించింది. దాదాపు రెండేళ్ల పాటు జాతీయ జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్‌కు ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం విండీస్‌ సెలక్టర్లు పిలుపునిచ్చారు. రస్సెల్‌ చివరగా వెస్టిండీస్‌ తరపున 2021లో ఆస్ట్రేలియాపై టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఇటీవల కాలంలో రస్సెస్‌ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండంతో మళ్లీ సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకున్నారు.

అదే విధంగా ఇంగ్లండ్‌తో వన్డేలకు దూరమైన స్టార్‌ ఆటగాళ్లు జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్‌ లు టీ20 జట్టులో మాత్రం చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు రోవ్‌మన్ పావెల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. షాయ్ హోప్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.  డిసెంబర్‌ 12న బార్బోడేస్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ​కాగా ఇప్పటికే ఇం‍గ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో వెస్టిండీస్‌ సొంతం చేసుకుంది.

ఇంగ్లండ్‌తో టీ20లకు విండీస్‌ జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్‌మెయర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్,  రొమారియో షెపర్డ్.
చదవండి: ENG vs WI: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్‌.. 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

Advertisement
Advertisement